ETV Bharat / entertainment

'కనిపించేంత సరదాగా ఉండను ఏడ్చేస్తా'.. బాడీ షేమింగ్​పై రోహిణి ఏమందంటే? - jabardasth rohini emotion

బుల్లితెర నటీమణుల్లో రోహిణికి ప్రత్యేక ఫ్యాన్​బేస్​ ఉంది. సెపరేట్​ కామెడీ టైమింగ్​తో జబర్దస్త్​లో అలరిస్తోంది. అయితే తాజాగా ఆమె.. 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడింది. తన బాడీ షేమింగ్​ పంచ్​లపై రోహిణి ఎలాంటి సమాధానం చెప్పింది? స్టేజీపై ఆమె ఎమోషనల్​ అవడానికి కారణాలు ఏంటి? రోజా, ఇంద్రజ గురించి ఆమె ఏం చెప్పింది?

rohini interview
రోహిణి
author img

By

Published : Jun 10, 2022, 10:18 AM IST

రోహిణి

రోహిణి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం సీరియళ్లు, సినిమాలు, టీవీ షోలతో తీరిక లేకుండా షూటింగ్స్​లో పాల్గొంటోంది. ముఖ్యంగా 'జబర్దస్త్'​లో చేయడం మొదలు పెట్టాక.. రోహిణి కెరీర్​ జెట్​ స్పీడుతో దూసుకుపోతోంది. జబర్దస్త్​లో తన కామెడీ టైమింగ్​తో కడుపుబ్బా నవ్విస్తోంది రోహిణి. తన వాయిస్​కే ఎక్కువమంది ఫ్యాన్స్​ ఉన్నారని చెబుతున్న ఆమె.. 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడింది.

జబర్దస్త్​​లోకి వచ్చిన మొదట్లో రోహిణి చాలా భయపడిందట. అంతకుముందు లేడీ గెటప్​ వేసిన పురుషులను చూస్తే.. ప్రేక్షకులు నవ్వేవారు. అయితే నేరుగా ఆడవాళ్లు.. లేడీ పాత్ర పోషిస్తే.. ప్రేక్షకులు నవ్వుతారా? అని భయపడిందట. కానీ సెట్లోకి అడుగుపెట్టాక.. ఆ అనుమానాలను పటాపంచలు చేసి.. తనకంటూ ఒక స్టైల్​ను ఏర్పరుచుకొని.. నవ్విస్తోంది రోహిణి.

జబర్దస్త్​లో రోహిణిపై వేసే పంచులు బాగా పేలుతుంటాయి. ముఖ్యంగా ఆమె లావుగా ఉండడంపై వేసే పంచులు బాగా వర్కవుట్​ అవుతుంటాయి. 'బాడీ షేమింగ్' పంచ్​లపై రోహిణి స్పందించింది. కొన్ని స్కిట్స్​లో రోహిణి అమ్మ కూడా.. ఆమెపై పంచ్​లు వేసింది. ఈ క్రమంలో తన అమ్మ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది రోహిణి. ' నన్ను స్కిట్​ కోసం తీసుకొచ్చి.. నీ మీద డైలాగ్​లు వేయిస్తారు' అని తన అమ్మ చెప్పినట్లుగా రోహిణి పేర్కొంది.

"ఫ్రెండ్స్​ కలిసినప్పుడు కూడా లావుగా ఉండటంపై పలు రకాల బూతులు తిట్టుకుంటాం. అప్పుడు తప్పు అనిపించదు. స్కిట్​లో బాడీ షేమింగ్​ విషయం వచ్చే సరికి ఫీలవుతుంటారు. బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని జోక్​గానే తీసుకోవాలి. ప్రేక్షకులు నవ్వుతారు అనుకున్నప్పుడు.. నా మీద ఎలాంటి డైలాగ్​ వేసినా.. పట్టించుకోను."

-రోహిణి

"నేను బయటకు సరదాగా, నవ్వుతూ.. కనిపిస్తా. కానీ.. చాలా సెన్సిటివ్. సందర్భం వచ్చినప్పుడు ఎమోషనల్​ అవుతుంటా. చిన్న విషయానికి హర్ట్​ అవుతా. నేను జబర్దస్త్​లోకి వచ్చాక.. అందరం ఒక ఫ్యామిలీగా అయిపోయాం. ఆర్టిస్టులు, ప్రొడక్షన్​ టీమ్​, మేనేజర్స్​, జడ్జిలు.. ఇలా అందరం ఒక ఫ్యామిలీనే. జడ్జిలు సపోర్టివ్​గా ఉంటారు. రోజా మేడమ్​కు నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంద్రజ మేడమ్​ చాలా క్లోజ్​. "

- రోహిణి

ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది రోహిణి. హనుమాన్​, నవీన్​ పొలిశెట్టి- అనుష్క కాంబినేషన్​లో వస్తున్న మూవీ, హ్యాపీ బర్తడే సినిమాలు ప్రస్తుతం చేస్తున్నట్లు వివరించింది రోహిణి.

ఇదీ చదవండి: పూజాహెగ్డేకు చేదు అనుభవం.. విమాన ప్రయాణంలో అలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.