ETV Bharat / entertainment

పంచ్‌ ప్రసాద్‌ హెల్త్​ అప్డేట్​.. వైద్యులు ఏమన్నారంటే? - జబర్దస్త్​ పంచ్ ప్రసాద్​ ఆరోగ్య పరిస్థితి

'జబర్దస్త్‌' కమెడియన్‌ 'పంచ్‌' ప్రసాద్‌ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ మరో కమెడియన్‌ నూకరాజు స్పెషల్‌ వీడియోను పంచుకున్నాడు. అందులో వైద్యులు ఏం చెప్పారంటే?

Jabardast Punch prasad Health video
పంచ్‌ ప్రసాద్‌ హెల్త్​ అప్డేట్​.. వైద్యులు ఏమన్నారంటే?
author img

By

Published : Nov 21, 2022, 7:18 PM IST

'జబర్దస్త్‌' కమెడియన్‌ 'పంచ్‌' ప్రసాద్‌ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ మరో కమెడియన్‌ నూకరాజు స్పెషల్‌ వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యులు ఏమన్నారు? వంటి విషయాలను ఇందులో తెలిపాడు.

పంచ్ ప్రసాద్ కాస్త కోలుకున్నాడని.. ఓ మనిషి సాయం.. లేదా కర్ర సాయంతో మెల్లగా నడుస్తున్నాడని చూపించాడు. గత నాలుగు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుందని.. అప్పటి నుంచి అతడికి రోజంత సెలైన్స్ పెడుతున్నారని .. ప్రత్యేకంగా ఓ నర్స్ కూడా ఇంట్లోనే ఉండి 24 గంటలు చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. మరో నాలుగు రోజులు ఇలాగే చికిత్స తీసుకోవాలని.. సెలైన్స్ ద్వారా పంచ్ ప్రసాద్​కు యాంటి బయోటిక్స్ ఇస్తున్నారని పేర్కొన్నాడు.

మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ పూర్తిస్థాయిలో నడవగలడా ? లేదా ? అనే విషయం చెబుతామని డాక్టర్స్ చెప్పినట్లు వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు,నెటిజన్లు కోరుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీచూడండి: ఓటీటీలోకి ఆస్కార్​ రేస్​ మూవీ 'ఛెల్లో షో'.. ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.