ETV Bharat / entertainment

ప్రశాంత్​ నీల్​-ఎన్టీఆర్​ సినిమాలో బాలీవుడ్​ స్టార్ హీరో.. ఏ పాత్రలో అంటే? - ప్రశాంత్​ నీల్​ ఎన్టీఆర్​ చిత్రం

ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్​31లో ఆమీర్​ఖాన్ నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ సంగతులు..

Is Aamir Khan In NTR 31
Ntr Aamir Khan
author img

By

Published : Dec 30, 2022, 2:19 PM IST

ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్​తో సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలే ఉంటాయి. ఎందుకంటే కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్​ 2 వంటి బ్లాక్​బస్టర్లను సౌత్​ ఇండస్ట్రీకి అందించాడు. అయితే ప్రశాంత్​ నీల్.. ​ జూ.ఎన్టీఆర్​తో కలిసి 'ఎన్టీఆర్ 31' సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని కీలక పాత్రలో ఆమీర్ నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్​ నీల్​.. విలన్ రోల్ కోసం అమీర్ ఖాన్‌ను సంప్రదించినట్లు సమాచారం. వీరిద్దరు కలిసి ఈ పాత్ర గురించి డిస్కస్ చేశారని, ఆమిర్​కు కూడా ఈ పాత్ర నచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం హాట్​ టాపిక్​గా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు.

ఇకపోతే ఆర్​ఆర్​ఆర్​తో సూపర్​ హిట్​ అందుకున్న తారక్​.. ప్రస్తుతం కొరటాలతో చేయబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇది కూడా ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. ఈ చిత్రం పూర్తయ్యాకే ప్రశాంత్​ నీల్​ సినిమాలో నటిస్తారు. ఇక ప్రశాంత్​ నీల్ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సలార్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబరు 28న విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.