Danny Masterson Verdict : అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరో డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 'దట్ సెవంటీస్' షో స్టార్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పును వెలువరించింది. కాగా డానీ మాస్టర్‌సన్ 2001లో ఓ 23 ఏళ్ల యువతిపై, అలాగే 2003లో మరో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా.. 2003 చివరిలో మరో 23 ఏళ్ల యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు అతనిపై వివిధ కేసులు నమోదయ్యాయి.
దీనిపై 2020 జూన్‌లోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించింది. అయితే 3.3 మిలియన్ డాలర్లు చెల్లించిన డానీ.. అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా ఈ విషయంపై బాధితులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా కోర్టు ఈ కేసుపై విచారణ జరిపించింది. అలా తాజాగా మరోమారు విచారణ జరగ్గా.. ఈ సారి డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా.. 2003 ఏడాది చివరిలో హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి ఓ యువతిని అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కానట్లు తెలిసింది.
Danny Masterson Jail : అయితే న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా.. ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమని విలపించింది. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్ 2017లో 'ద రాంచ్ అనే కామెడీ షో' నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది.
Danny Masterson Career : ఇక డానీ కెరీర్ విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన 47 ఏళ్ల డానీ మాస్టర్ సన్.. నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ మోడల్‌గా చేస్తూనే.. పలు యాడ్స్‌లోనూ నటించాడు. 1980లో కెరీర్ ప్రారంభించిన డానీ.. 1998 నుంచి 2006 వరకు ప్రసారమైన' దట్ సెవంటీస్' అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. ఈ షోలో అతని నటనకు మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన 2012-2014లో విడుదలైన 'మెన్ ఎట్ వర్క్'లో మిలో ఫోస్టర్ అనే పాత్రను పోషించాడు. 2016-2018లో ప్రసారమైన 'ది రాంచ్' అనే టెలివిజన్ షో లో జేమ్సన్ 'రూస్టర్' బెన్నెట్ అనే పాత్రలో మెరిశాడు. ఆయన ఓ యాక్టరే కాదు డీజే కూడా. 'DJ Mom Jeans' అనే పేరుతో పలు సాంగ్స్‌ను కంపోజ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు.