ETV Bharat / entertainment

'పవన్​-అకీరా నా హార్ట్.. ఆ పోస్టర్‌కు జనసేనకు ఎలాంటి సంబంధం లేదు' - హిట్​2 మూవీ డైరెక్టర్​

అడివి శేష్‌ హీరోగా నటించిన చిత్రం 'హిట్‌-2'. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా వైజాగ్‌లో జరిగిన ఓ అమ్మాయి హత్య కేసు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ విడుదల అనంతరం చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. ఆ సంగతులు.

hit 2 trailer release event
అడివి శేష్‌
author img

By

Published : Nov 24, 2022, 8:33 AM IST

HIT 2 Trailer Release Event: అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'హిట్‌-2' . శైలేశ్‌ కొలను దర్శకుడు. వైజాగ్‌లో జరిగిన ఓ అమ్మాయి హత్య కేసు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ విడుదల అనంతరం చిత్రబృందం మీడియాతో మాట్లాడింది.

మీ ట్రైలర్‌ నోయిడాలో జరిగిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసును గుర్తు చేసేలా ఉంది?
శేష్‌: మా సినిమాలో ఓ అమ్మాయి పేరు శ్రద్ధ అని ఉండటం.. నోయిడాలో జరిగిన ఓ సంఘటననే మా సినిమాలో ఒక కేసుగా వివరించడం.. ఇదంతా అనుకోకుండా జరిగింది. శ్రద్ధా వాకర్‌ సంఘటన జరగడానికి ఎన్నో నెలల ముందే శైలేశ్‌ ఈ కథ రాసుకున్నారు. 'హిట్‌' రిలీజైనప్పుడే దిశ సంఘటన జరిగింది. ఇలాంటి ఘటన జరగాలని మేము కోరుకోం. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది మాత్రమే.

కొన్ని సినిమాలు సమాజంలో హింస ప్రేరేపించేలా ఉంటున్నాయని పలువురు విమర్శలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
శైలేశ్‌‌: క్రైమ్‌ సినిమాలు తెరకెక్కించేటప్పుడు దానిలోని తీవ్రతను ఎక్కువగా చూపించకూడదు. ఆ విషయంలో మేమెంతో కేర్‌ తీసుకున్నాం. ఒక చెడుపై మంచి ఎలా గెలుస్తుంది? అన్న కోణంలోనే ఈ సినిమా తెరకెక్కించాం. ఇక, క్రిమినల్‌ మైండ్‌ ఉన్న వాళ్లు కేవలం సినిమాలు చూసే అలాంటి పనులు చేస్తున్నారని అనుకోవడానికి లేదు.

hero adavi shes
అడివి శేష్‌

మీరు ఎక్కువగా పోలీస్‌, థ్రిల్లర్‌ సినిమాల్లో నటిస్తున్నారు దానికి ఏదైనా కారణం ఉందా?
శేష్‌: సందీప్‌ ఉన్నికృష్ణన్‌ది పోలీస్‌ రోల్‌ కాదు. అది ఒక దేశభక్తి ఉన్న వ్యక్తి పాత్ర. ఒక వెటకారం ఉన్న విశాఖపట్నం పోలీస్‌ అధికారికి, ఒక సున్నితమైన ఆర్మీ అధికారికి ఎంతో వ్యత్యాసం ఉందని నమ్ముతున్నా. వృత్తి కంటే కూడా పాత్రలో విభిన్నమైన కోణాలు ఉండాలని నేను భావిస్తా.

థ్రిల్లర్‌ సినిమాల్లో నటించడం సేఫా లేదా రిక్సా?
శేష్‌: నాకు తెలియదు. నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అయితే బయోపిక్‌. నాకు బాగా నచ్చి.. నేను నమ్మింది మాత్రమే చేస్తున్నా.

ఈ పాత్రను ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి?
శేష్‌: హీరో పాత్రలో ఉండే వెటకారం ప్రధాన కారణం. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. వెటకారంగా మాట్లాడే పోలీసే అయినప్పటికీ ఎంతో మంచి వ్యక్తి‌. రెండు విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తి క్యారెక్టర్‌ ఇది.

ఈ పాత్ర కోసం మీరు ఏదైనా వర్కౌట్‌ చేశారా?
శేష్‌: అలా ఏమీ చేయలేదు. శైలేశ్‌ ఎంతో రీసెర్చ్‌ చేసి స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. దాని వల్ల ఈ కథ నుంచే ఎన్నో విషయాలు తెలుసుకున్నా.

దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తే రిలీజ్‌ డేట్‌ మారుస్తారా?
శేష్‌: సినిమా అయితే తెలుగులో డిసెంబర్‌ 2నే విడుదల చేస్తాం. హిందీలో రిలీజ్‌కు కాస్త సమయం తీసుకుంటాం. ఒరిజినల్‌గా దీన్ని మేము తెలుగుకే ప్లాన్‌ చేశాం. కానీ, హిందీ నుంచి రెస్పాన్స్‌ బాగా వస్తోంది. దానివల్ల ఆలోచనలో పడ్డాం. 'దృశ్యం 2' కూడా హిందీలో మంచి హిట్ అందుకుంది. దాంతో మాకు నమ్మకం వచ్చింది.

భవిష్యత్తులో మీ నుంచి పాన్‌ ఇండియా సినిమాలే వస్తాయా?
శేష్‌: నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను తెలుగు సినిమా చేసినా, హిందీ సినిమా చేసినా ఇండియన్‌ సినిమా చేస్తా. అది కూడా ఇక్కడ కూర్చొనే చేస్తా. ఈ రెండు ఖాయం.

hero adavi shes
అడివి శేష్‌

ఈ సినిమా అంగీకరించడానికి కారణం నానినా? కథా? దర్శకుడా?
శేష్‌: ఈ మూడు. నాని ఎప్పటికీ ఒక గైడ్‌. శైలేశ్‌ అద్భుతమైన దర్శకుడు. ఇక, ఈ కథ చేయకపోతే నా తప్పు అవుతుంది.

ఒకే ఏడాదిలో ఇద్దరు హీరోలు నిర్మించిన చిత్రాల్లో నటించడంపై మీ అభిప్రాయం?
శేష్‌: నేను అదృష్టంగా భావిస్తున్నా. హీరోలు నమ్మిన హీరోని అయినందుకు ఆనందిస్తున్నా.

'హిట్‌'వర్స్‌లో నాని హీరోగా ఉండే అవకాశం ఉందా?
శైలేశ్‌‌: ఇప్పటికి 'హిట్‌-2'ను ఎంజాయ్‌ చేద్దాం. కాకపోతే 'హిట్‌-3' చిత్రాన్ని గ్రాండ్‌ లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నా.

hero adavi shes
అడివి శేష్‌

ఈ పోస్టర్‌పై 'జనసేన' గాజు గ్లాసు పెట్టడం వెనక కారణం ?
శేష్‌: పవన్‌కల్యాణ్‌, అకీరాకు నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంది. ఆ పోస్టర్‌లో ఉన్నది జనసేన గ్లాసు కాదు.

క్రియేటివ్‌ సైడ్‌ నాని ఏదైనా సలహాలు ఇచ్చారా?
శైలేశ్‌‌: స్క్రిప్ట్ రాసేటప్పుడు డైలాగ్‌ వెర్షన్‌ వరకూ నానితో కూర్చొని, ఆయన ఓకే అన్నాకే మేము ఫైనల్‌ చేశాం. ఈ చిత్రాన్ని బిగ్‌ స్క్రీన్‌ కోసమే సిద్ధం చేశాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: అకీరా కోసం రంగంలోకి అడివి శేష్.. గ్రాండ్​గా ఎంట్రీ ప్లాన్​!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.