ETV Bharat / entertainment

అల్లుఅర్జున్​ బాటలో యశ్​.. ఆ యాడ్​కు నో.. ఫ్యాన్స్ ఖుష్​​! - పాన్ మసాలా హీరో యశ్​

కోట్ల రూపాయలు రెమ్యునరేషన్​ ఇస్తానని ఆఫర్​ చేసినా హీరో యశ్​ మాత్రం ఓ యాడ్​లో నటించేందుకు నిరాకరించారు. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని ఆలోచించారు. అంతకుముందు హీరో అల్లుఅర్జున్​ కూడా ఇదే పని చేశారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే?

Hero Yash rejects Pan Masal Advertisement
యశ్ పాన్​ మసాలా
author img

By

Published : Apr 30, 2022, 2:20 PM IST

Yash Pan Masala Advertisement: కన్నడ రాకింగ్ స్టార్​ యశ్​ నటించిన 'కేజీయఫ్‌-2'.. ఇంకా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీని కొనసాగిస్తూనే ఉంది. రాఖీభాయ్‌గా స్టైల్‌, యాక్షన్‌తో అద్భుతంగా డైలాగ్స్‌ చెప్పి సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు యశ్​. ఈ సినిమా సాధించిన విజయంతో ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. దీంతో యశ్​ ఇమేజ్​ను పలు సంస్థలు క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్నాయి. రూ.కోట్లు కుమ్మరించి తమ కంపెనీలకు బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే తనకు ఓ సంస్థ ఇచ్చిన బడా ఆఫర్​ను యశ్​ సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.

ఈ మధ్య కాలంలో పాన్​ మసాలా యాడ్స్​ గురించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ప్రమోట్​ చేస్తున్న స్టార్​ హీరోలను సోషల్​మీడియాలో ట్రోలింగ్​ చేస్తూ నెటిజన్లు మండుతున్నారు. దీంతో ఆయా హీరోలు పాన్ మాసాలా ప్రకటనల నుంచి తప్పుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా క్షమాపణలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తమ కంపెనీకి బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరించాలంటూ సదరు సంస్థ యశ్​ను సంప్రదించిందట! కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్​ కూడా ఇచ్చారని తెలిసింది. అయినా యశ్​ మాత్రం ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారని నటుడి ప్రతినిధి తెలిపారు. అంతకుముందు పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న అల్లుఅర్జున్​ను​ కూడా సదరు కంపెనీ సంప్రదించిందని, అయితే బన్నీ కూడా ఆ ఆఫర్​ను తిరస్కరించారని కథనాలు వచ్చాయి. కాగా, ఇప్పటికే అమితాబ్​, జాన్​ అబ్రహాం, సన్నీలియోనీ, అక్షయ్​కుమార్​ వంటి ప్రముఖులు పాన్ మసాలా సంస్థల నుంచి తప్పుకున్నారు.

ఇదీ చూడండి: 'కేజీయఫ్​ 2' @1000కోట్లు.. 'ఆచార్య' తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.