ETV Bharat / entertainment

రెండున్న‌రేళ్లు షూటింగ్.. 4 రిలీజ్ డేట్స్ ఛేంజ్‌.. 'వీరమల్లు' పరిస్థితేంటి? - పవన్​ హరి హర వీరమల్లు రిలీడ్​ డేట్​

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్​ మొదలై రెండున్నరేళ్లు గడిచింది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ఏడాదైన రిలీజ్​ అవుతుందా? లేదా? అసలేం జరుగుతోంది?

hero pawan kalyan movie
hero pawan kalyan movie
author img

By

Published : Mar 25, 2023, 7:11 AM IST

టాలీవుడ్​ స్టార్​ హీరో పవన్​ కల్యాణ్​ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు సినిమాలు పట్టాలెక్కించగా.. మరో రెండు సిద్ధం చేశారు. ఇటీవలే ఐదో సినిమాకు కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని తెలుస్తోంది. అయితే సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం రీమేక్​.. నెల రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ సినిమాను నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తామని.. జులైలో రిలీజ్​ చేయబోతున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. కానీ క్రిష్​ దర్శకత్వంలో రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్​పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పవన్​ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

2020లో స్టార్ట్​..
2020 సంవత్సరం సెప్టెంబరు నెలలో దర్శకుడు క్రిష్.. హరిహర వీరమల్లు షూటింగ్​ను మొదలుపెట్టారు. కానీ 30 నెలలుగా ఈ సినిమా షూటింగ్​ సాగుతూనే ఉంది. హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లుతో పాటు షూటింగ్ మొద‌లుపెట్టిన పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఈ గ్యాప్‌లో రెండు సినిమాల్ని పూర్తిచేశారట. కానీ ప‌వ‌న్ మూవీ మాత్రం 50 శాతం షూటింగ్ కూడా పూర్తికాలేద‌ట.

విడుదల తేదీలు ఎన్ని ప్రకటిస్తారో?
మొదట.. ఏడాదిలోగే ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేస్తి.. 2021 సెప్టెంబరు నెలలో హరిహర వీరమల్లు విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఆ తర్వాత నాలుగు విడుదల తేదీలు ప్రకటించారు. కానీ సినిమా రిలీజ్​ కాలేదు. చిత్రయూనిట్​ చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయారని ఫ్యాన్స్​.. నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఈ సారి అనౌన్స్ చేసే ఐదో రిలీజ్ డేట్‌కు అయినా సినిమాను రిలీజ్ చేస్తారో లేదో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం.. ఈ చిత్రాన్ని ద‌స‌రాకు రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అప్ప‌టిలోగా షూటింగ్ పూర్తి చేసుకొని సినిమాను రిలీజ్ చేస్తారా? లేదా? అన్న‌ది అనుమానంగానే ఉందని ఫ్యాన్స్​ అంటున్నారు.

ప్రస్తుతం పవన్​ కల్యాణ్​.. సముద్ర ఖని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సుజీత్​, హారీశ్​ శంకర్​ సినిమాలు చేయనున్నారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించి వార్తలు వస్తున్నా.. హరిహర వీరమల్లుకు సంబంధించి ఎలాంటి కొత్త అప్డేట్ రావడం లేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోందా లేదా అన్న‌ది కూడా డౌటే! ఈ సినిమాకు ప‌వ‌న్ డేట్స్ క‌రెక్ట్‌గానే ఇచ్చినా స‌కాలంలో షెడ్యూల్స్ పూర్తిచేయ‌డంలో క్రిష్ విఫ‌ల‌మైన‌ట్లుగా సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మొఘ‌లుల‌ కాలం నాటి క‌థాంశంతో క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో.. హీరో ప‌వ‌న్ బందిపోటు దొంగ పాత్ర‌లో న‌టిస్తున్నారట. బీటౌన్​ స్టార్ హీరో బాబీ డియోల్.. మొఘ‌లుల రాజు ఔరంగ‌జేబు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పవన్​ సరసన క్యూట్​ భామ నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.