Hero Nikhil Father Died: యువ నటుడు నిఖిల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరిన శ్యామ్ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా నిఖిల్‌కు ఎంతో ప్రోత్సహాన్నిచ్చేవారు శ్యామ్. సోషల్ మీడియా వేదికగా ఓ సందర్భంలో తన తండ్రిని నిఖిల్ అభిమానులకు పరిచయం చేశారు.
ఇదీ చదవండి: 'కొరటాల'ను నమ్మి.. నాన్న నేను గుడ్డిగా దూకేశాం: రామ్‌చరణ్