ETV Bharat / entertainment

లైట్ గడ్డంతో మహేశ్ బాబు కొత్త లుక్ అదుర్స్ - హీరో మహేశ్​ బాబు లుక్​

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్​తో సూపర్​స్టార్​ మ‌హేశ్​ బాబు తన కొత్త సినిమా చేయనున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుంది. అయితే ఈ సినిమాలో మ‌హేశ్​ లుక్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది.

hero mahesh babu new look
hero mahesh babu new look
author img

By

Published : Aug 14, 2022, 12:13 PM IST

Mahesh Babu New Look: 'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత పూర్తిగా ఫ్యామిలీకి ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించారు హీరో మ‌హేశ్​ బాబు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి విదేశాలకు వెళ్లి వచ్చారు. లండ‌న్‌, యూర‌ప్‌తో పాటు ప‌లు దేశాల‌ను ప‌ర్య‌టించారు. ప్ర‌స్తుతం ఈ టూర్స్ ముగించుకున్న ఆయ‌న.. త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్​లో పాల్గొనబోతున్నారు. ఇందులో మ‌హేశ్​ లుక్ ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే అభిమానులకు తన కొత్త స్టిల్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చారు మ‌హేశ్​ బాబు. సోమ‌వారం మ‌హేశ్​ షేర్​ చేసిన న్యూ లుక్ ఫొటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో లైట్​గా గ‌డ్డం, మీసంక‌ట్టుతో స్టైలిష్‌గా మ‌హేశ్​ క‌నిపిస్తున్నారు. 'లవింగ్ ది న్యూ వైబ్' అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మహేశ్​ లుక్​ను సంగీత దర్శకుడు త‌మ‌న్, డైరెక్టర్​ తివ్రిక్రమ్​.. 'ఎస్ఎస్ఎమ్‌బీ 28' హ్యాష్​ ట్యాగ్​ ఇచ్చి ట్వీట్ చేశారు. దీంతో త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌హేష్ ఈ లుక్‌లోనే క‌నిపించ‌నున్నారంటూ ఓ చిన్న క్లారిటీ ఇచ్చేశారు.

అంతకుముందు శ‌నివారం మ‌హేశ్​ బాబు ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోల‌ను ఆయన స‌తీమ‌ణి న‌మ‌త్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'అత‌డు','ఖ‌లేజా' త‌ర్వాత మ‌హేశ్​బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హారిక‌,హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనున్నారు.

ఇవీ చదవండి: ఆ సూపర్​హిట్​ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తానంటున్న రౌడీ హీరో

ఉత్తమ నటుడిగా​ ఆస్కార్ రేసులో తారక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.