బాలీవుడ్ కండలవీడురు సల్మాన్ ఖాన్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ' సినిమాకు సీక్వెల్.. 'నో ఎంట్రీ మే ఎంట్రీ' మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాను భారీ తారాగణంతో రూపొందించనున్నారట. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కూడా నటిస్తున్నారు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 'నో ఎంట్రీ మే ఎంట్రీ' మూవీలో 10 మంది టాప్ హీరోయిన్లు నటించనున్నారట. అందులో సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే, తమన్నా భాటియా లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు దాదాపు ఖారారైనట్టు సమాచారం. ఆ పది మంది కూడా దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్లు కావడం గమనార్హం.
ఇటీవల దక్షిణాదిన సత్తా చాటాలని సల్మాన్‌ఖాన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవి గాఢ్‌ఫాదర్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. సమంత, రష్మిక, పూజా, తమన్నా భాటియా, పూజా లాంటి స్టార్ హీరోయిన్లను తీసుకోవడం ద్వారా.. 'నో ఎంట్రీ మే ఎంట్రీ' సినిమాను దక్షిణాది భాషల్లో కూడా ప్రమోట్ చేయాలని సల్మాన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని నటీనటులు పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇదీ చదవండి: కమెడియన్‌కు రూ.3.91కోట్ల జరిమానా.. 50 ఏళ్ల క్రితం నేరానికి ఇప్పుడు శిక్ష