ETV Bharat / entertainment

హరిహర వీరమల్లు షూటింగ్​ సెట్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం! - Hari Hara Veera Mallu Story

Hari Hara Veeramallu Fire Accident : ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింగి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంతకీ ఘటన ఎక్కడ జరిగిందంటే..

hari hara veera mallu fire in shooting
హరిహర వీరమల్లు సెట్‌లో అగ్నిప్రమాదం
author img

By

Published : May 29, 2023, 7:52 PM IST

Updated : May 29, 2023, 8:14 PM IST

Hari Hara Veeramallu Fire Accident : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్​లో వస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం షూటింగ్​లో భాగంగా దుండిగల్‌ పరిధిలోని బౌరంపేట్‌లో ఓ భారీ సెట్ వేశారు. ఆదివారం అర్ధరాత్రి సెట్​లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన చిత్రబృందం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేని జరగలేదని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యుల్ వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదించింది. ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇటీవలే పవన్ కల్యాణ్ పచ్చజెండా ఊపారట. మళ్లీ త్వరలోనే షూటింగ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ఈ ప్రమాదం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Hari Hara Veeramallu Shooting Update : సినిమాలో ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒక భారీ సెట్​ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా ఆ సెట్ కాస్త తీవ్రంగా దెబ్బతింది. అలా ధ్వంసమైన సెట్​ను రిపేర్​ చేసి మళ్లీ షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. తిరిగి ఆ సెట్​ను మరమ్మతు చేసే క్రమంలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. అక్కడే ఉన్న థర్మాకోల్​కు నిప్పు రవ్వలు తగలడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. అలా ఒకే సెట్ రెండు సార్లు దెబ్బతినటంతో భారీగా అస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.

Hari Hara Veera Mallu Story : ఇక సినిమా విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు 17వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. ఓ వీరోచిత బందిపోటుగా పవన్‌ కల్యాణ్‌ తెరపై సందడి చేయనున్నారు. మొఘలాయిలు, కుతుబ్‌షాహీ శకం నేపథ్యంలో సాగే కథ కావటం వల్ల... ప్రాచీన యుద్ధ విద్యలతో కూడిన పోరాట ఘట్టాల్ని డిజైన్‌ చేస్తున్నారు. అందుకోసం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. యాక్షన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ కౌశల్‌ పోరాట ఘట్టాల్ని ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు క్రిష్​ ఈ సినిమాను పీరియాడిక్ డ్రామా జోనర్​లో తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్​ సరసన నిధి అగర్వాల్​, నర్గీష్‌ ఫక్రీ హీరోయిన్​లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు 'బాబీ డియోల్‌' మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Last Updated : May 29, 2023, 8:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.