ETV Bharat / entertainment

రూ.100 కోట్లు దాటేసిన 'హనుమాన్' - అక్కడ 'సలార్​', 'బాహుబలి' రికార్డ్స్​ బ్రేక్​ - హనుమాన్​ బాక్సాఫీస్​ కలెక్షన్స్​

Hanuman Movie Collections Worldwide : సూపర్ హిట్​ టాక్​తో దూసుకుపోతున్న 'హనుమాన్​' చిత్రం కలెక్షన్స్​ పరంగానూ సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్​ మార్క్​ను దాటేసినట్లు మూవీటీమ్​ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే వసూళ్ల విషయంలో హారో ప్రభాస్ నటించిన 'సలార్​', 'బాహుబలి' పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.

Hanuman Movie Collections Worldwide Till Now
Hanuman Movie Collections
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 4:43 PM IST

Updated : Jan 16, 2024, 5:35 PM IST

Hanuman Movie Collections Worldwide : డైరెక్టర్​ ప్రశాంత్​ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలై కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్​ కలెక్షన్స్​ను అందుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్​ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

సంక్రాంతి బరిలో ఇప్పటికే విడుదలైన అగ్ర హీరోల సినిమాలు 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' లాంటి చిత్రాలను బీట్​ చేసి మరీ తక్కువ సమయంలోనే ఇంత భారీ కలెక్షన్స్​ను 'హనుమాన్​' అందుకుంది. అలాగే నార్త్‌ అమెరికాలో నాలుగు రోజుల్లోనే 3 మిలియన్ల డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో టాప్‌ 10లో స్థానం సొంతం చేసుకుంది. దీంతో ఓవర్సీస్​(నార్త్‌ అమెరికాలో) ఇప్పటికే ప్రముఖ సినిమాలు 'సలార్​', 'బాహుబలి' పేరిట ఉన్న మొదటి వీకెండ్‌ బాక్సాఫీస్​ కలెక్షన్స్​ రికార్డులను బ్రేక్​ చేసింది.

ప్రశంసల వెల్లువ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 'హనుమాన్​' రూ.100కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్​ వర్మ 'రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమా' అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆడియెన్స్​కు స్పెషల్​గా థ్యాంక్స్​ తెలిపారు. మరోవైపు సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసిన మెగాస్టార్​ చిరంజీవి- తనను అభినందిస్తూ మెసేజ్‌ పెట్టినట్లు హీరో తేజ సజ్జ ఇటీవల తెలిపారు. తాజాగా హీరో రామ్ పోతినేని కూడా ఈ చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

త్వరలో రూ.300-400 కోట్లు?
సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తక్కువ బడ్జెట్​లో రూపొందిన 'హనుమాన్​' చిత్రం విడుదలకు సరిపడా థియేటర్లు దొరకనప్పటికీ, సినిమా కంటెంట్​పై ఉన్న నమ్మకంతో అరకొరా స్క్రీన్​లతోనే మూవీని విడుదల చేశారు మేకర్స్​. అయినప్పటికీ బెనిఫిట్​ షో నుంచే పాజిటివ్​ రెస్పాన్స్​ అందుకున్న ఈ చిత్రానికి నార్త్​ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన కలెక్షన్స్​ వసూలు అవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 'హనుమాన్​'కు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే- ఇక మున్ముందు రూ.300-400 కోట్లు కొల్లగొట్టినా పెద్దగా ఆశ్చర్యానికి గురికానక్కర్లేదేమో.

ఇదే నాకు చివరి తెలుగు సినిమా - అందుకే అలా చేశా : మహేశ్ బాబు

'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?

Last Updated : Jan 16, 2024, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.