Justin Beiber disease: హాలీవుడ్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత జస్టిన్ బీబర్‌కు ఓ అరుదైన వ్యాధి సోకింది. తాను ముఖ పక్షవాతానికి గురైనట్లు తెలిపాడు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని షేర్ చేశాడు. రామ్ సే హంట్ సిండ్రీమ్తో తాను బాధపడుతున్నట్లు తెలిపాడు. ఈ వ్యాధిలో భాగమే తన ముఖానికి పక్షవాతం వచ్చిందని.. కన్ను కూడా ఆర్పలేనని వివరించాడు. ముఖంలోని కుడి భాగం వైపు నాడి వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టూర్లో ఉన్న అతడు ఈ వ్యాధి కారణంగా తన తదుపరి పర్యటలను కొంత కాలం రద్దు చేసుకున్నట్లు తెలిపాడు. పూర్తిగా కోలుకునేంతవరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఇవ్వనని చెప్పాడు. దీంతో అతడు భారత్‌కు కూడా రావట్లేదు. కాగా, ఈ రోగం ఓ వైరస్ ద్వారా వ్యాపిస్తుందని తెలిసింది. ఈ విషయం తెలియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
బీబర్.. ఇటీవలే ప్రపంచ టూర్ ప్రారంభించాడు. దాదాపు 30 దేశాల్లో 125కుపైగా ప్రదర్శనలు ఇవ్వాలని అనుకున్నాడు. మే నెలలో మెక్సికోలో ప్రారంభమైందీ పర్యటన. 2017లోనూ బీబీర్ ముంబయిలోని ఓ మైదానంలో ప్రదర్శన ఇచ్చారు. అంతకుముందు అతడి భార్య హెలీ కూడా ఓ వ్యాధి బారిన పడింది. ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టడం కొంత కాలం పాటు చికిత్స తీసుకుని దాని బారి నుంచి బయటపడింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: పెళ్లిపై మాట్లాడిన సాయిపల్లవి.. ఏమన్నారంటే?