ETV Bharat / entertainment

కేఫ్‌లో తొలిసారి ప్రభాస్‌ను కలిశా.. అప్పుడే స్టార్​ అవుతారని ఫిక్సయ్యా: 'ఈశ్వర్' డైరెక్టర్​ - ప్రభాస్​ కొత్త చిత్రాలు

Prabhas 20 years: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు చిత్రసీమలో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం 'ఈశ్వర్' విడుదలై శుక్రవారంతో 20 ఏళ్లు పూర్తయింది. అయితే ప్రభాస్‌ను తొలి సినిమా 'ఈశ్వర్​'కు హీరోగా ఎలా ఎంపిక చేశారో డైరెక్టర్‌ జయంత్‌ పరాన్జీ ఓ చిట్​చాట్‌లో చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే..

Prabhas 20 Years Eswar Movie
Prabhas 20 Years Eswar Movie
author img

By

Published : Nov 11, 2022, 7:36 PM IST

Prabhas 20 Years Eswar Movie: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడిగా 'ఈశ్వర్‌' సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయమయ్యారు ప్రభాస్. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2002 నవంబర్‌ 11న విడుదలైంది. నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌ నేటితో సక్సెస్‌ఫుల్​గా 20 సంవత్సరాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను తొలి సినిమా ఈశ్వర్​కు హీరోగా ఎలా ఎంపిక చేశారో డైరెక్టర్‌ జయంత్‌ పరాన్జీ ఓ చిట్‌ చాట్‌లో చెప్పుకొచ్చారు.

"టక్కరిదొంగ సినిమాకు ముందే ఒక సినిమా చేయాలని అశోక్‌కుమార్‌ (ఈశ్వర్‌ నిర్మాత, విలన్‌)కు ఓ కమిట్​మెంట్‌ ఉంది. కానీ అప్పుడు చాలా మంది ప్రేమకథలు తెరకెక్కిస్తున్నారు. నాకు లవ్‌ స్టోరీలంటే ఇష్టం. టక్కరి దొంగ తర్వాత లవ్‌స్టోరీ చేద్దామనేదే ఒరిజినల్‌ ప్లాన్. నిర్మాతగా అశోక్‌కుమార్‌ ఫైనల్‌. కథ మీద కూర్చున్నాం. చిన్న బడ్జెట్‌లో చిన్న సినిమా చేద్దామనేదే ప్లాన్. అప్పటికే తేజ కొత్తవాళ్లతో చిత్రం, నువ్వునేను చేసి ట్రెండ్‌సెట్ చేసేశారు. తేజ చేసినపుడు మేమెందుకు చేయలేమనుకున్నాం. అయితే స్టోరీ రాసుకుంటున్నపుడు కేవలం లవ్‌ స్టోరీ మాత్రమే కాకుండా యాక్షన్‌ కూడా ఉండాలనుకున్నాం."

"కథ చాలా బాగా వచ్చింది. అశోక్‌కుమార్‌కు కోటిన్నరలో సినిమా చేయాలని మాటిచ్చాను. అంతకంటే ముందు భారీ బడ్జెట్‌ సినిమాలు తీశాను. కథ రెడీ అయ్యాక.. ఈ సినిమాకు చాక్లెట్‌ బాయ్‌ లాంటి హీరో కరెక్ట్ కాదు..ఎవరైతే యాక్షన్‌ కూడా బాగా చేస్తారో ఆయనే కావాలనుకున్నాం. హీరో మాస్‌ అప్పీలుండాలి. అందుకే క్యారెక్టర్‌ను ధూల్​పేట్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేశాం. కొత్త కుర్రాళ్ల ఫొటోలు చాలా అశోక్‌ కుమార్ ఆఫీస్‌కు వచ్చాయి. అశోక్‌కుమార్ ఓ రోజు నాతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారు."

"కృష్ణంరాజు గారి సోదరుడి కుమారుడు సత్యానంద్‌ దగ్గర శిక్షణ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాడని చెప్పారు. ఫొటోలు తెప్పించాలని అడిగితే తెప్పించారు. ఫొటోలు చాలా బాగున్నాయి. ఫొటో చూసిన వెంటనే ఫొటో జెనిక్‌ బాయ్‌ అని వెంటనే అర్థమైంది. హైట్‌ అడిగితే 6ప్లస్‌ అన్నారు. మా సినిమా హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయనిపించింది. ఆ తర్వాత సత్యానంద్‌గారికి ఫోన్‌ చేశాం. ఎలాంటి సబ్జెక్టో నాకు తెలియదు..కానీ ఆ కుర్రాడిలో ఫైర్‌, స్పార్క్‌ ఉందని సత్యానంద్‌ అన్నారు."

"అశోక్‌కుమార్‌ ఫిలించాంబర్‌కు ప్రభాస్‌ను పిలిపిస్తే వెంటనే అందరికీ తెలిసిపోతుందని అనుకున్నారు. ప్రభాస్‌ను కలిస్తే తప్ప ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ వెంటనే బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 1లో బరిస్టా కాఫీ షాప్‌లో తొలి మీటింగ్. మేమక్కడికి వెళ్లినపుడు ప్రభాస్‌ ఎవరో స్నేహితుడితో కూర్చున్నారు. అప్పుడే మొదటిసారి నేను ప్రభాస్‌ను కలిశా. మొదటి మీటింగ్‌లోనే ప్రభాస్‌ నిల్చున్న తీరు..షేక్ హ్యాండ్ ఇచ్చిన విధానం.. కచ్చితంగా స్టార్‌ అవుతారనిపించింది. చూడగానే నచ్చేశారు. మా సినిమా హీరో ప్రభాస్​ అని ఫిక్స్‌ అయిపోయా."

"ఎప్పటినుంచి ట్రైనింగ్ అని ప్రభాస్‌ను అడిగితే..నేనింకా ట్రైనింగ్ అవలేదండీ.. నాకు ఇంకొంత సమయం కావాలన్నారు. ట్రైనింగ్ అవసరం లేదు.. డైరెక్ట్‌గా సినిమాలో జాయిన్ అవడమే అని ప్రభాస్‌తో అన్నాను. ప్రభాస్‌ అసలు కథ కూడా అడగలేదు. లవ్‌, యాక్షన్‌, మాస్‌ సినిమా అని చెప్పా.. అంతే నన్ను నమ్మి సినిమాకు ఒకే చేశారు..అలా ఈశ్వర్ సినిమా ఒకే అయింది" అంటూ చెప్పుకొచ్చారు జయంత్ సీ పరాన్జీ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.