ETV Bharat / entertainment

చిరంజీవి సినిమా సెట్​లో అగ్నిప్రమాదం.. ఆందోళనలో అభిమానులు! - ఆచార్య సినిమా ధర్శస్థలి సెట్​కు అగ్ని ప్రమాదం

మెగాస్టార్​ చిరంజీవి సినిమా సెట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. సెట్​లో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

fire accident in acharya movie dharmasthali set
acharya movie dharmasthali set
author img

By

Published : Feb 28, 2023, 10:51 AM IST

మెగాస్టార్​ చిరంజీవి సినిమా సెట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. 'ఆచార్య' సినిమా కోసం హైదరాబాద్​ కోకాపేట్​లో వేసిన 'ధర్మస్థలి' అనే సెట్​లో నుంచి సోమవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సెట్​లో ఎవరు లేనందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా, సినిమాలోని ధర్మస్థలి అనే ఊరు కోసం వేసిన ఈ భారీ సెట్​లో.. సినిమాలోని పలు సన్నివేశాలను అక్కడే చిత్రీకరించారు. 'భరత్​ అనే నేను' సినిమాకు పని చేసిన ప్రముఖ ఆర్ట్​ డైరెక్టర్​ సెల్వ రాజన్​ ఈ సెట్​ను డిజైన్​ చేశారు. ఇక, బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ సినిమా.. 'కిసీ కా భాయ్​ కిసీ కి జాన్​' లోని పలు సీన్స్​ కూడా ఈ 'ధర్మస్థలి' సెట్​లోనే షూట్​ చేసినట్లు తెలుస్తోంది.

ఇక 'ఆచార్య' సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్​లో ఈ మూవీ తెరకెక్కింది. మెగాస్టార్​ చిరంజీవి, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ నటించిన ఈ సినిమాలో.. పూజా హెగ్డే కథానాయిక. 2022 ఏప్రిల్​ 29న విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్​ వద్ద నిరాశే ఎదురైంది. అయితే భారీ బడ్జెట్​తో వేసిన ఈ సెట్​ మాత్రం సినిమాలో స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. అంతే కాకుండా ఈ సెట్​ను పలు సినిమాల చిత్రీకరణకు వాడుకున్నట్లు సమాచారం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.