ETV Bharat / entertainment

'వీర సింహారెడ్డిలో ఇంటర్వెల్, వాల్తేరు వీరయ్యలో రవితేజ ఎపిసోడ్.. చూస్తే కన్నీళ్లు ఖాయం!'

రామ్​-లక్ష్మణ్​.. ఎన్నో సూపర్​హిట్ సినిమాలకు యాక్షన్​ కొరియోగ్రఫీ చేసిన కవల సోదరులు. సంక్రాంతి రేసులో ఉన్న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' , బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాల్లో ఫైట్ సీక్వెన్స్​లు డిజైన్ చేసింది వీరే. ఆ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు రామ్​-లక్ష్మణ్.

fight masters ram lakshman latest interview
fight masters ram lakshman
author img

By

Published : Jan 1, 2023, 7:39 AM IST

శక్తిమంతమైన పోరాట ఘట్టాలతో ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో అందెవేసిన చేయి రామ్‌ - లక్ష్మణ్‌లది . ఈ సోదర ద్వయం ఇప్పుడు చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' , బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'చిత్రాలకు యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌గా పనిచేశారు. ఈ సినిమాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు రామ్‌ - లక్ష్మణ్‌.

ఓ ఫైట్‌ చిత్రీకరించే విషయంలో మీరిద్దరూ బాధ్యతలు ఎలా పంచుకుంటారు?
"ప్రత్యేకంగా అలా ఏమీ ఉండదు. యాక్షన్‌ ఐడియాలో ఇద్దరిలో ఎవరికైనా రావొచ్చు. మా అదృష్టం ఏమిటంటే.. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ప్రతి ఫైట్‌ విషయంలోనూ రెండు ఆలోచనలతో దర్శకుడి ముందుకు వెళ్తాం. వాటిలో ఏది నచ్చితే దానితో ముందుకెళ్తుంటాం. మేము నమ్మేది ఒక్కటే.. ప్రతి ఫైట్‌కు ఓ కాన్సెప్ట్‌ ఉండాలి. అలా లేదంటే దానికి పరిపూర్ణత రాదు. ఇన్నేళ్లుగా తెరపై ఎన్నో పోరాట ఘట్టాలు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అవే తన్నులాటలు చూడాలంటే ఎవరికైనా బోర్‌గానే అనిపిస్తుంది. కాబట్టి ప్రతి పోరాట ఘట్టాన్నీ ప్రేక్షకులు మెచ్చేలా కొంచెం ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ దట్టించి.. కాస్త కొత్తదనాన్ని జోడించి చూపించాల్సిన అవసరం ఉంటుంది".

ఈ రెండు చిత్రాల్లో భావోద్వేగాలు ఎలా ఉండనున్నాయి?
"బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లో ఇంటర్వెల్‌ చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది. అది చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేస్తారు. మేము సెట్‌లోనే కన్నీళ్లు పెట్టేసుకున్నాం. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి, రవితేజ మధ్య ఒక ఎమోషనల్‌ డ్రామా ఉంటుంది. చిరు అన్నయ్య అద్భుతంగా చేశారు. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది".

ఈ మధ్య పాటలతోనూ పోరాట ఘట్టాల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ట్రెండ్‌ను ఎలా చూస్తారు?
"ఇది చాలా మంచి పరిణామమే. మాకూ కొత్తదనం చూపించే అవకాశం దొరుకుతోంది. ‘అల.. వైకుంఠపురంలో’ క్లైమాక్స్‌ ఫైట్‌ను పాటతో చిత్రీకరించాలన్న ఆలోచన త్రివిక్రమ్‌దే. ఆ ఆలోచన మాతో పంచుకున్నప్పుడు మాకూ అదొక సరికొత్త సవాల్‌లా అనిపించింది. రొటీన్‌ ఫైట్లు చాలా చేశాం. ఇలా పాటతో కలిపి చేస్తే కొత్తగా ఉంటుంది కదా అనిపించింది. అది ప్రేక్షకులకూ కొత్త అనుభూతిని పంచింది".

చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు ఒకే పండక్కి వస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ఫైట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
"ఆయా హీరోల ఇమేజ్‌కు తగ్గట్లుగా బాబీ, గోపీచంద్‌ మలినేని శక్తిమంతమైన కథలు సిద్ధం చేసుకున్నారు. రెండు సినిమాలూ వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. అందుకే మా ఫైట్ల విషయంలోనూ వైవిధ్యత చూపించే అవకాశం బాగా దొరికింది. రెండూ ఒకే జానర్‌ కథలై ఉండుంటే మేమూ ఇబ్బంది పడి ఉండేవాళ్లం. 'వాల్తేరు వీరయ్య'లో ఇంటర్వెల్‌ ఫైట్‌ ఆకట్టుకుంటుంది. ముఠామేస్త్రిలా లుంగీ కట్టుకొని.. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ.. అందరితో కలిసిపోయే మాస్‌ మనిషి వీరయ్య. అలాంటి వ్యక్తి ఇంటర్వెల్‌కు ముందు రెండు తుపాకులు పట్టుకొని.. స్టైలిష్‌గా ప్రతినాయకులపైకి విరుచుకుపడతాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఫైట్‌ కోసం పదహారు రోజులు కష్టపడ్డాం. అలాగే ఇందులో చిరంజీవి - శ్రుతిహాసన్‌ మధ్య ఓ సరదా ఫైట్‌ కంపోజ్‌ చేశాం. దాన్నీ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. ఇక ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణ కుర్చీలో కూర్చొని విలన్‌ గ్యాంగ్‌ను కొట్టే ఫైట్‌, టర్కీలో చేసిన ఇంటర్వెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.