Spy Movies In India : సినీ ఇండస్ట్రీలో థ్రిల్లర్స్ కొత్తేం కాదు. ఇప్పటికే ఈ జానర్లో ఎన్నో సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ ముందు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంచలనాలు సృష్టించగా.. మరి కొన్ని యావరేజ్ టాక్‌తో సరిపెట్టకున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్లలోనూ అంతే. కంటెంట్ ఉన్న మంచి సినిమాలు థియేటర్లలో దూసుకెళ్తుండగా.. ప్రయోగాత్మక సినిమాలు అంతంత మాత్రంగానే నెట్టుకొస్తుంటాయి.
Hollywood Spy Movies : ఇక హాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ అంతా దాదాపుగా అదే మేనియా నడుస్తుంటుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే అభిమానులు ఇటువంటి సినిమాల కోసం హాలీవుడ్‌నే అనుసరిస్తుంటారు. అప్పట్లో వచ్చిన 'జేమ్స్ బాండ్' నుంచి ఇప్పట్లో వచ్చిన 'టెనెట్', 'ఆపరేషన్ ఫార్చ్యూన్' వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించినవే. సస్పెన్స్‌తో సాగే ప్రతి సీన్ ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టించినవే.
అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని స్పై సినిమాలు తెరకెక్కి మంచి టాక్ సంపాదించుకున్నాయి. బాలీవుడ్లో విడుదలైన షారుక్ ఖాన్ 'పఠాన్' యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేయగా.. 'ఏక్ థా టైగర్', 'రాజీ', 'ఏజెంట్ వినోద్', 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి' , 'బెల్ బాటమ్' లాంటి సినిమాలు కూడా అద్భుతమైన కథతో ప్రేక్షకులను అలరించాయి. ఇక టాలీవుడ్‌లోనూ ఎన్నో స్పై థ్రిల్లర్స్ వచ్చి అభిమానుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Spy Movies Telugu : నైన్టీస్ కిడ్స్ను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన 'అన్వేషణ' నుంచి థియేటర్లలో హల్చల్ చేసిన 'హిట్ 2' వరకు ఈ జానర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే తాజాగా వచ్చిన అఖిల్ 'ఏజెంట్' మాత్రం అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంత ఆసక్తిగా ఉండకపోవడం వల్ల ప్రేక్షకులు దీన్ని స్వీకరించలేకపోయారు.
మరోవైపు కొన్ని కథలు సాధారణంగా అనిపించినా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తుంటారు దర్శకులు. కానీ కొన్ని కథల విషయంలో అలా చేయలేం. ఎన్ని మార్పులు చేసినా.. సరైన స్క్రీన్ ప్లే లేకుంటే సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశగానే మిగులుతాయి. ఇక గురువారం విడుదలైన నిఖిల్ 'స్పై' కూడా దాదాపుగా మిశ్రమ స్పందనతో నడుస్తోంది. కానీ ఇటువంటి సినిమాలన్నింటినీ అలవోకగా చేస్తూ.. 'స్పై' మూవీస్ అంటే కచ్చితంగా ఈ హీరోతోనే తెరకెక్కించాలనేలా ఇండస్ట్రీలో తనదైన మార్క్‌ను సెట్ చేసుకున్నారు యంగ్ హీరో అడివి శేష్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Adivi Sesh Spy Movies : 'ఎవరు','గూఢచారి','ఎవరు','హిట్ 2' లాంటి సినిమాలు హిట్ అవ్వడం వెనుక శేష్ కృషి అంతా ఇంతా కాదు. ఇటువంటి సినిమాలు తెరకెక్కిస్తున్నప్పుడు ఈ స్టార్ హీరో క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందిన సందర్భాలున్నాయి. స్వతహాగా మంచి రైటర్ అయిన శేష్.. ఏ దర్శకుడితో పని చేసినా.. స్క్రీన్ ప్లే విషయంలో మంచి కసరత్తు చేసి.. తన స్క్రిప్ట్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటారు. దానిపై చాలా దృష్టి పెడతారు. అలా ఎటువంటి అడ్డంకులు లేకుండా సినిమాను సాఫీగా తెరకెక్కించే విషయంలో శేష్ స్టైలే వేరు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇలా ఒకే తరహా చిత్రాల్లో నటిస్తూ.. అభిమానులకు బోర్ కొట్టకుండా చేయడం అంత ఈజీ పని కాదు. కానీ శేష్‌కు అవన్నీ సర్వసాధారణం. దీంతో అభిమానులు సైతం ఇప్పట్లో వస్తున్న స్పై చిత్రాలను చూసి ఈ సినిమాల్లో శేష్ ఉంటే ఇంకెంత బాగుంటుందో అంటూ అభిప్రాయపడుతున్నారు. శేష్‌లా ఇంకో స్టార్ ఎవరైనా ఈ కథలకు న్యాయం చేసేందుకు వస్తారా అని వేచి చూస్తున్నారు.