'మహానటి' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా 'సీతారామం' సినిమాతో మరింత దగ్గరయ్యారు. మరి ఈ మలయాళ హీరో ఏ వయసులో పారితోషికం తీసుకున్నారు, ఎంత తీసుకున్నారో తెలుసా? తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే.
ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ పలు విషయాలను పంచుకున్నారు. తను తీసుకున్న మొదటి పారితోషికం 2000 రూపాయలని తెలిపారు. అది తనకు రెండు కోట్లతో సమానమన్నారు.
'నాకు 10ఏళ్లు ఉన్నప్పుడు రాజీవ్ మేనన్ యాడ్ ఏజన్సీ వాళ్లు మా స్కూల్‌కు వచ్చారు. ఒక యాడ్ కోసం కొంతమందిని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన వాళ్లలో నేను ఉన్నాను. వాళ్లు నాకు 2000 రూపాయలు ఇచ్చారు. అది నాకు రెండు కోట్లతో సమానం. ఆ డబ్బుల్లో నేను 500రూపాయలు మా అమ్మమ్మ, తాతయ్యలకు ఇచ్చాను. మిగతావి మా అమ్మకు ఇచ్చాను. అప్పటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా మా అమ్మను ఆ డబ్బులతో కొనిపెట్టమనే వాడిని. మా అమ్మ నువ్వు ఆ డబ్బులు ఎప్పుడో ఖర్చుపెట్టుకున్నావని సరదాగా చెప్పేది' అంటూ దుల్కర్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి: విజయ్-అజిత్ కాంబోలో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే?