ETV Bharat / entertainment

ప్రభాస్​ వల్ల రాజమౌళిని తిడుతున్న డైరెక్టర్స్!.. ఎందుకంటే?​ - ప్రభాస్​ ఛత్రపతి ఇంటర్వెల్​ సీన్​

దర్శకధీరుడు రాజమౌళిని ఇతర దర్శకులు తిట్టుకుంటున్నారట! అది కూడా ప్రభాస్ చేస్తున్న ఓ పని వల్ల. ఇంతకీ అదేంటంటే..

Prabhas Rajamouli
ప్రభాస్​ వల్ల రాజమౌళిని తిడుతున్న డైరెక్టర్స్.. ఎందుకంటే?​
author img

By

Published : Apr 7, 2023, 1:06 PM IST

Updated : Apr 7, 2023, 3:37 PM IST

'బాహుబలి' సిరీస్​తో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ రెబల్​ స్టార్​ ప్రభాస్‌. ఆ ఒక్క సినిమా ఆయన రేంజ్​ను అమాంతం పెంచేసింది. అయితే ఆయన జనం ముందు ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడాలంటే చాలా మొహమాటం పడుతుంటారు. ఆయన్ను సిగ్గరి అంటుంటారు. అందుకే ఆయన ఎక్కువగా ఎవరి ఫంక్షన్స్​కు రారు. తన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్​లోనూ ఆయన ఎక్కువసేపు మాట్లాడరు. చాలా తక్కువగా మాట్లాడి ముగించేస్తుంటారు. అలాగే సెట్‌లోనూ కూడా ఎక్కువమంది ఆర్టిస్ట్‌లు, మిగతా వారు ఉంటే.. గట్టిగా డైలాగ్​లు కూడా చెప్పడానికి తెగ ఇబ్బంది పడిపోతారట. అవును మీరు చదివేది నిజమే.. అయితే ఈ ఇబ్బంది వల్ల ఓ సారి దర్శకధీరుడు రాజమౌళి తిట్లు తినాల్సి వచ్చిందట.

ప్రభాస్‌-రాజమౌళి కాంబినేషన్‌లో 'ఛత్రపతి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. సినిమా ఇంటర్వెల్‌ చిత్రీకరణ సమయంలో విలన్‌ను చంపిన తర్వాత.. కోట శ్రీనివాసరావుకు వార్నింగ్‌ ఇచ్చి బయటకు వచ్చిన సమయంలో జనాన్ని ఉద్దేశిస్తూ ప్రభాస్‌ డైలాగ్‌ చెప్పాలి. ఓవైపు వర్షం, మరోవైపు చలితో ఇబ్బంది పడుతున్న ఆయన.. అంత మంది జనం కనిపించే సరికి డైలాగ్‌ చెప్పలేకపోయారట. అక్కడే ఉన్న డైరెక్టర్​ రాజమౌళిని పిలిచి 'నేను డైలాగ్‌ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతా. ప్లీజ్‌..' అని అన్నారట.

దీనికి జక్కన్న కూడా ఒప్పుకోవడం వల్ల హైపిచ్‌లో చెప్పాల్సిన డైలాగ్‌ను.. చిన్నగా చెబుతూ ఆ షాట్​ను పూర్తి చేశారట. రాజమౌళి 'షాట్‌ ఓకే' అనగానే అప్పటి వరకూ రిహార్సల్స్‌ అనుకున్నవారంతా ఆశ్చర్యపోయారట. ఇక 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రీకరణ సమయంలోనూ ప్రభాస్​ పెద్దగా డైలాగ్‌ చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోయారట. అక్కడే ఉన్న దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ పిలిచి.. 'ఇలాగైతే ఎలాగయ్యా.. ఓపెన్‌గా డైలాగ్‌ చెప్పగలగాలి. సిగ్గు పడితే ఎలా' అని అన్నారట. దీంతో ఆయన ముందు ప్రభాస్​ సరే సర్‌ అనేసి.. ఆ తర్వాత మళ్లీ చాలా మొహమాటం పడేవారట. ఇక అప్పటి నుంచి ప్రభాస్‌తో పనిచేసే డైరెక్టర్స్​ అందరూ రాజమౌళిని తిట్టడం ప్రారంభించారు. 'రాజమౌళి అలవాటు చేయడం వల్లే నువ్వు డైలాగ్‌లు ఇలా స్లోగా చెబుతున్నావు" అనేవారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే ప్రభాస్​ ప్రస్తుతం ఆదిపురుష్​, సలార్​, ప్రాజెక్ట్​ కే సినిమా షూటింగ్​లతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'బలగం'కు మరో అంతర్జాతీయ అవార్డు.. బెస్ట్​ డైరెక్టర్​గా వేణు

Last Updated : Apr 7, 2023, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.