dhoni lgm movie review : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ సీఎస్కే సారథి ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క్రికెట్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో అతడికి ఉన్న క్రేజ్ మాత్రం మాటల్లో చెప్పలేం. మిగతా ప్రపంచానికి మహేంద్ర సింగ్ ధోనీగా అభిమానం సంపాదించుకుంటే.. తమిళ తంబీలకు మాత్రం తల, తలైవాగా వారి గుండెల్లో నిలిచిపోయాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ఐపీఎల్ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో భాగంగా ఓ చిత్రాన్ని నిర్మించారు. మొదటి సినిమాగా 'లెట్స్ గెట్ మ్యారీడ్'శ్(ఎల్‌జీఎమ్) రూపొందించారు. తమిళ ఆడియెన్స్‌ను ఫోకస్ చేస్తూ.. తమిళ యాక్టర్స్తోనే ఈ సినిమాను చేశారు.
ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా అభిమానుల్లో ఆసక్తిని నింపాయి. మరీ ముఖ్యంగా ధోనీ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాపై మరింత ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇటీవలే జులై 28న అక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రివ్యూలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది తంబీలకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని ఆ రివ్యూల ద్వారా అర్థమవుతోంది. మిక్స్డ్ టాక్ వచ్చిందట. స్టోరీ, స్క్రీన్‌ప్లే యావరేజ్‌గా అందంటూ సినీ ప్రియులు ట్వీట్లు చేస్తున్నారు. కేవలం సినిమాలో యోగిబాబు మార్క్ కామెడీ పెర్ఫార్మెన్సే అదిరిపోయిందని అంటున్నారు. అతని కోసం సినిమాకు వెళ్లొచ్చని చెబుతున్నారు.
దీంతో ఈ సినిమా లాంగ్ రన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతొస్తాయో, పెట్టిన బడ్జెట్ వస్తుందో లేదో అని అంతా మాట్లాడుకుంటున్నారు. యోగిబాబే.. సినిమాను ఆదుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో.. హరీశ్ కల్యాణ్, 'లవ్‌టుడే' ఫేమ్ ఇవానా హీరోహీరోయిన్లుగా నటించారు నదియా, యోగిబాబు, ఆర్.జె. విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రలో నటించారు. అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారట. ఈ చిత్రానికి రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 4న రిలీజ్ చేయనున్నారు.
ఇదీ చూడండి :
LGM movie dhoni : ప్రభాస్- ధోనీ- బన్నీ సినిమా.. ఆ ఊహే ఎంత బాగుందో?