ETV Bharat / entertainment

శ్రద్ధాదాస్​​ ముద్దు కోసం హైపర్​ ఆది సాహసం, ఏం చేశాడంటే - Dhee 14 latest promo

నటి శ్రద్ధాదాస్​ జబర్దస్త్​ కమెడియన్​ హైపర్​ఆదికి ఓ స్పెషల్​ టాస్క్​ ఇచ్చింది. అది పూర్తి చేస్తే అతడికి ముద్దు ఇస్తానని ఆఫర్​ చేసింది. దాని కోసం ఆది పెద్ద సాహసమే చేశాడు. ఏంటంటే..

Sharaddha Das Offers Kisses To Hyper Adi
హైపర్​ ఆదికి శ్రద్ధాదాస్
author img

By

Published : Aug 18, 2022, 1:52 PM IST

Updated : Aug 18, 2022, 3:14 PM IST

హైపర్ ఆది.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర షోల్లో చేసే అతడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనదైన పంచ్​లతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్​టైన్​ చేస్తుంటాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ-14 వంటి షోల్లో జడ్డీలు, యాంకర్లు, కంటెస్టెంట్​లతో కలిసి కామెడీ పంచ్​లు పేల్చుతూ సందడి చేస్తుంటాడు.

అయితే తాజాగా ఢీ-14 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో శ్రద్ధాదాస్, హైపర్ ఆది మధ్య రొమాంటిక్ ట్రాక్ నడిచింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా అయిన ఆది.. ఆమెను తన మాటలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆది మాటలకు ఫిదా అయిన శ్రద్ధా.. అతడికి ముద్దు ఆఫర్ చేసింది.

ఇక శ్రద్ధా ముద్దు కోసం అతడు మంచు గడ్డపై నిల్చునే సాహసం చేయడం, ఆమె కోసం పాటలు పాడటం చాలా ఫన్నీగా, ఎంటర్​టైనింగ్​గా ఉన్నాయి. మరి అతడు.. శ్రద్ధా చెప్పిన సమయం మొత్తం ఐస్​ గడ్డపై నిల్చున్నాడా.. ఆమె ముద్దును అందుకున్నాడా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్​ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఫస్ట్​లవ్​.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ త‌మ ఫ‌స్ట్​లవ్​ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆది కూడా త‌న మొదటి ప్రేమ గురించి తెలిపాడు. తాను ఎనిమిదో త‌ర‌గ‌తి వరకు త‌మ ఊరులోని స్కూల్​లో చ‌దివాన‌ని, ఆ త‌ర్వాత తొమ్మిదో త‌ర‌గ‌తి కోసం ప్రైవేట్ స్కూల్​కు మారిన‌ట్టు చెప్పాడు. అక్క‌డే ఓ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డినట్లు తెలిపాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వీల్​చైర్​లో దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్​, ఏమైంది

Last Updated : Aug 18, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.