ETV Bharat / entertainment

'ప్రాజెక్ట్​ కె'.. కామిక్ కాన్ ఈవెంట్​కు దీపికా పదుకొణె డుమ్మా.. బలమైన కారణమే! - దీపిక పదుకొణె శాన్ డిగో ఈవెంట్​కు డుమ్మా

project k san diego Deepika padukone : 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్​ లాంఛ్ కోసం ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్​కు ఇప్పటికే ప్రభాస్, రానా,​ కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. కానీ చిత్రంలో ప్రభాస్​తో పాటు మరో ప్రధాన పాత్రలో హీరోయిన్​గా నటిస్తున్న దీపికా పదుకొణె మాత్రం.. ఈ ఈవెంట్​కు హాజరు కావట్లేదు. దీని వెనక బలమైన కారణమే ఉంది. ఆ వివరాలు..

'ప్రాజెక్ట్​ కె'.. కామిక్ కాన్ ఈవెంట్​కు దీపికా పదుకొణె డుమ్మా
'ప్రాజెక్ట్​ కె' శాన్​ డిగో కామిక్ కాన్ ఈవెంట్​కు దీపికా పదుకొణె డుమ్మా
author img

By

Published : Jul 19, 2023, 4:48 PM IST

project k san diego Deepika padukone : పాన్ ఇండియా ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్​ ఫిక్షన్ ఫిల్మ్​ 'ప్రాజెక్ట్ కె'. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్​ను.. ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్​లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజుల నుంచి మూవీటీమ్​ వరుసగా సర్​ప్రైజ్​లు ఇస్తోంది.

అయితే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్​ కోసం ఇప్పటికే ప్రభాస్, రానా,​ కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. కానీ చిత్రంలో ప్రభాస్​తో పాటు మరో ప్రధాన పాత్రలో హీరోయిన్​గా నటిస్తున్న దీపికా పదుకొణె మాత్రం.. ఈ ఈవెంట్​కు హాజరు కావట్లేదు. అయితే దీని వెనక ఓ బలమైన కారణమే ఉందని తెలిసింది.

అదేంటంటే.. ప్రస్తుతం హాలీవుడ్​లో యాక్టర్స్​ సమ్మె జరుగుతోంది. షూటింగ్స్​ అన్నింటినీ మధ్యలోనే నిలిపివేసి.. ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమ్మె.. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఫెడరేషన్​లో దీపిక పదుకొణె కూడా ఓ సభ్యురాలే.

అయితే ఈ నిరసనలలో పాల్గొన్న సభ్యులంతా అలాగే ఫెడరేషన్​లోని సభ్యులంతా.. ఎటువంటి షూటింగ్​లలోనూ, అలాగే సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదు. అందుకే దీపిక.. ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్​ లాంఛ్ ఈవెంట్ కోసం.. శాన్ డీగో కామిక్ ఈవెంట్​కు వెళ్లడం లేదు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు తెలిపినట్లు ఇంగ్లీష్ మీడియా సంస్థలు ప్రచురిస్తున్నాయి.ఇకపోతే ఈ సమ్మెకు.. బాలీవుడ్ ​భామ, గ్లోబల్ స్టార్​ ప్రియాంకా చోప్రా కూడా మద్దతు తెలుపుతోంది.

"స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మె జరుగుతుండటం వల్ల యాక్టర్స్​ ఎవరూ షూటింగ్​లలో లేదా ప్రమోషనల్ ఈవెంట్స్​లో పాల్గొనకూడదని ఆదేశాలు వచ్చాయి. శాన్ డీగో కామిక్ కాన్ లాంటి భారీ ఈవెంట్లలో కూడా పాల్గొనకూడదు. అందుకే దీపిక.. ఈ శాన్​ డీగో ఈవెంట్​కు వెళ్లడం లేదు" అని ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి.

ఇకపోతే 2017లోనే హాలీవుడ్ స్టార్​ నటుడు​ విన్ డీజిల్​తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్' సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. అప్పుడే ఈ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఫెడరేషన్​లో మెంబర్​గా జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ భామ 'ప్రాజెక్ట్​​ కె'తో పాటు హృతిక్ రోషన్​​తో 'ఫైటర్​', షారుక్​ ఖాన్ 'జవాన్'​లో నటిస్తోంది.

ఇదీ చూడండి :

హాలీవుడ్ రేంజ్‌లో దీపిక 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్​ లుక్.. మీకు నచ్చిందా?

​ రెబల్స్​కు సర్​ఫ్రైజ్​.. ప్రాజెక్ట్​-కె టైటిల్​ రివీల్​.. దేశంలో తొలి సినిమాగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.