ETV Bharat / entertainment

ర‌జ‌నీ సినిమా నుంచి త‌ప్పుకున్న నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌.. కారణమిదే.. - rajnikanth lal salam

సూపర్​స్టార్​ రజనీకాంత్​ కీలకపాత్రలో నటించనున్న 'లాల్ సలామ్'​ సినిమా నుంచి కాస్ట్యూమ్ డిజైన‌ర్ పూర్ణిమ తప్పుకుంది. షూటింగ్​ మొదలు కాకముందే ఆమె తప్పుకోవడంతో ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

costume-designer-poornima-ramaswamy-walked-out-from-rajinikanth-lal-salaam-movie

author img

By

Published : Jan 22, 2023, 9:26 PM IST

క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో షూటింగ్ మొద‌లుకాక‌ముందే ర‌జ‌నీకాంత్ 'లాల్ స‌లామ్' సినిమా నుంచి కాస్ట్యూమ్ డిజైన‌ర్ త‌ప్పుకోవ‌డం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. లాల్ స‌లామ్ సినిమాకు ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. షూటింగ్ మొద‌లుకాక‌ముందే లాల్ స‌లామ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కాస్ట్యూమ్ డిజైన‌ర్ పూర్ణిమ రామ‌స్వామి ట్వీట్ చేసింది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో త‌లెత్తిన కొన్ని ఇబ్బందుల‌ వ‌ల్ల ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు పూర్ణిమ ట్వీట్‌లో పేర్కొంది. సినిమా పోస్ట‌ర్స్ నుంచి త‌న పేరును తొల‌గించాల్సిందిగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ను కోరింది. ఆమె ట్వీట్ త‌మిళ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌తో త‌లెత్తిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తోనే పూర్ణిమ త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తున్నారు. స్పోర్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో కీల‌క‌ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌బోతున్నారు. కాగా, బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'ప‌ర‌దశి' సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా జాతీయ అవార్డు అందుకుంది పూర్ణిమ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.