Chiranjeevi BholaSankar Movie: చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. అన్నాచెల్లెలి అనుబంధాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా తమన్నా కనిపించనుంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Brahmastra Movie Amitabh Look:'బ్రహ్మాస్త్ర'... బాలీవుడ్ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సెప్టెంబరు 9న విడుదల కానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ నాయకానాయికలు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో ఆయన లుక్‌ను కరణ్‌జోహర్ విడుదల చేశారు. గురు పాత్రలో ఆయన ఈ చిత్రంలో గంభీరంగా, శక్తిమంతంగా కనిపిస్తారని పేర్కొన్నారు. నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
Shivakarthikeyan Movie Title: శివ కార్తికేయన్ హీరోగా కె.వి.అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సునీల్ నారంగ్, డి.సురేష్‌బాబు, పుస్కుర్ రామ్ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరియా ర్యాబోషప్క కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి 'ప్రిన్స్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో కార్తికేయన్ తెల్లటి దుస్తులు ధరించి, చేతిలో గ్లోబ్ పట్టుకొని శాంతిని ప్రభోదించే వ్యక్తిలా కనిపించారు. "ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. భారత్‌లోని పుదుచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యాల్లో సాగుతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని చిత్ర బృందం తెలిపింది. తమన్ స్వరాలందిస్తున్నారు.
ఇదీ చదవండి: 'టికెట్ ధరల పెంపు అర్థంలేని పని.. చాలా నష్టపోతున్నాం'