ETV Bharat / entertainment

ఏంది మళ్లీనా.. చిరు-బాలయ్య గ్యాప్​ ఇవ్వట్లేదుగా! - ఎన్​బీకే 108 వర్సెస్​చిరంజీవి భోళా శంకర్

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌.. నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ వీర‌సింహా రెడ్డి చిత్రాలు హోరా హోరీగా బాక్సాఫీస్​ వద్ద పోటీ ప‌డ్డాయి. అలానే రెండు చిత్రాలు కమర్షియల్​ హిట్స్​ను సొంతం చేసుకున్నాయి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు అగ్ర నటుల సినిమాలు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయట. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే?

chiranjeevi bhola shankar and balakrishna nbk 108 to clash once again

author img

By

Published : Feb 3, 2023, 1:34 PM IST

సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల సినిమాలు చాలా సార్లు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి ఎన్టీఆర్​ ఏయన్నార్​ నుంచి ఇప్పటి చిరంజీవి బాలయ్య వరకు అందరి సినిమాలు ఎప్పుడో ఒక్కసారైనా క్లాష్​ అయ్యాయి. ఇటీవలే 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కూడా అదే జరిగింది. 'వాల్తేరు వీర‌య్య'గా మెగాస్టార్​ వస్తే.. వీరసింహారెడ్డిగా బాలయ్య వచ్చారు. జోరుగా పోటీ పడ్డ ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో కమర్షియల్​ హిట్స్​గా నిలిచాయి. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే 'వీరసింహారెడ్డి' కన్నా 'వాల్తేరు వీర‌య్య‌'కే ఎక్కవ కలెక్షన్స్​ వచ్చాయి. అయితే మరో సారి ఈ ఇద్దరు తారలు బాక్సాఫీస్​ వద్ద పోటీ పడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ప్ర‌స్తుతం నటసింహం బాల‌కృష్ణ తన 108వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 'ఎఫ్​3' దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు బాలయ్య సైన్​ చేశారు. మరో వైపు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న 'భోళా శంక‌ర్' సినిమాలో చిరు నటిస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయని సమాచారం.

ఇప్ప‌టికే భోళా శంక‌ర్, ఎన్​బీకే 108ను మే 12న ఒకేరోజు విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జరుగుతున్నట్లు గతంలో పలు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వచ్చిన టాక్ ప్రకారం ఈ రెండు సినిమాలు జులైలో విడుదలకు సిద్ధమవ్వనున్నాయట. మరి ఈ రెండింటిలో ఏది నిజమన్నది చిత్ర యూనిటే డిసైడ్​ చేయాలంటున్నారు అభిమానులు. వారి నుంచి అఫిషియల్ అప్డేట్​ వస్తే కాని ఈ రూమర్స్​కు ఫుల్​ స్టాప్​ పడదంటూ సోషల్​ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

కాగా చిరంజీవి.. 'భోళా శంక‌ర్' మూవీ త‌మిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌. ఇందులో చిరు సరసన త‌మ‌న్నా న‌టిస్తుండగా.. చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ క‌నిపించ‌నుంది. బ్రదర్​ అండ్​ సిస్టర్​ సెంటిమెంట్​తో రూపొందుతోన్న ఈ సినిమాను అనిల్‌ సుంక‌ర, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మ‌రో వైపు ఫాదర్​ అండ్​ డాటర్​ రూపొందుతున్న ఎన్​బీకే 108వ సినిమాలో బాల‌య్య కూతురిగా శ్రీలీల క‌నిపించ‌నుంద‌ి. ఈ మూవీకి సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.