ETV Bharat / entertainment

చిరు వర్సెస్ బాలయ్య.. అప్పుడు సిమ్రాన్​.. ఇప్పుడు శ్రుతి.. ఈ సారి ఏం అవుతుందో? - valteru veerauua veerasimha reddy

టాలీవుడ్​ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ మరోసారి ఈ సంక్రాంతికి పోటీ పడనున్నారు. అయితే ఈ సారి వారి చిత్రాల గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ సంగతులు..

Chiranjeevi balakrishna
చిరు వర్సెస్ బాలయ్య
author img

By

Published : Dec 1, 2022, 3:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ రెండు పేర్లకు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవతరం కథానాయకులు వస్తున్నా వారికి పోటీగా నిలుస్తూ ఇంకా టాలీవుడ్​ను ఏలుతున్నారు. వీరిద్దరి సినిమా రిలీజ్​ అవుతుంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇప్పటికే చాలా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ అగ్రహీరోలు వచ్చే సంక్రాంతికి కూడా పోటీపడనున్నారు. సాధారణంగానే సంక్రాంతి పోరు అంటేనే మస్తు మజా ఉంటుంది. అందులోనూ చిరు, బాలయ్య లాంటి హీరోల మధ్య పోటీ అంటే అది వేరే లెవల్​ అనే చెప్పాలి.

అలా ఈ ఇద్దరు వేరువేరుగా నటించిన 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర‌సింహారెడ్డి' రెండు సినిమాలు ఒక్క రోజు తేడాలో థియేట‌ర్ల‌లో సందడి చేయనున్నాయి. అయితే ఈ సారి వీరిద్దరి సినిమాల గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. 2001 సంవత్సరంలో కూడా సంక్రాంతి పండగకు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఇందులో విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్​ సిమ్రానే. మృగరాజ్​ చిత్రంలో హోమ్లీ క్యారెక్టర్ చేసిన సిమ్రాన్.. 'నరసింహనాయుడు'లో గ్లామర్ డాల్​గా కనిపించి మురిపించింది. అయితే ఇందులో బాలయ్య 'న‌ర‌సింహానాయుడు' ఇండ‌స్ట్రీ హిట్‌ కొట్టగా.. చిరు 'మృగ‌రాజు' నిరాశ పరిచింది.

అలా ఈ సంక్రాంతికి కూడా ఈ ఇద్ద‌రు హీరోల‌కు జోడీగా ఒకే హీరోయిన్ న‌టించ‌డం విశేషంగా మారింది. అంటే దాదాపు 22 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అదే ఇద్ద‌రు హీరోలు.. అదే సంక్రాంతి పోరు.. ఒక్క‌టే హీరోయిన్‌..! కాకపోతే ఈ సారి శ్రుతిహాసన్​. మరి ఈ సారి ఎవరు ఇండస్ట్రీ హిట్ కొడతారో? ఎవరో నిరాశపరుస్తారో? లేదా ఇద్దరు మంచి విజయాన్ని అందుకుంటారా? అనే కుతూహలం ఫ్యాన్స్​లో భారీగా నెలకొంది.

ఇవీ చదవండి: మళ్లీ హాట్​టాపిక్​గా అదితి సిద్ధార్థ్​ రిలేషన్​ ఆ హోటల్​లో కెమెరా కంటికి చిక్కిన జంట

ప్రెగ్నెంట్​ అంటూ ప్రచారం క్లారిటీ ఇచ్చిన మలైక అర్జున్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.