ETV Bharat / entertainment

ఆయన సినిమాల్ని టచ్​ చేస్తే.. నాకు పెద్ద ఎదురుదెబ్బే: మెగాస్టార్​

మెగాస్టార్​ చిరంజీవి కెరీర్​ పరంగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆమిర్​ ఖాన్, నాగచైతన్య​ నటించిన లాల్​సింగ్​ చద్దా సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చిట్​చాట్​లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్​ నటుడి సినిమాలను రీమేక్​ చేస్తారా అన్న ప్రశ్నకు.. అస్సలు టచ్​ చేయనని చెప్పారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా?

Chiranjeevi Aamir Khan and Naga Chaitanya Special Chit Chat With Nagarjuna About Lal Singh Chaddha

author img

By

Published : Aug 9, 2022, 5:11 PM IST

Updated : Aug 9, 2022, 6:27 PM IST

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ సినిమాల్ని రీమేక్‌ చేసే ప్రయత్నం చేస్తే తనకు ఎదురుదెబ్బ తగులుతుందన్నారు చిరంజీవి. ఆమిర్‌ హీరోగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకానున్న నేపథ్యంలో ఆమిర్‌, నాగ చైతన్య, చిరంజీవిని నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివీ..

నాగార్జున: ఈ చిత్రాన్ని ఎందుకు సమర్పిస్తున్నారు?
చిరంజీవి: 'లాల్‌సింగ్‌ చద్దా' కథకు, నా జీవితానికి కనెక్షన్ ఉంది. 2019లో నేనూ నా భార్య సురేఖ జపాన్‌ వెళ్లాం. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ కలిశారు. ఎన్నో విశేషాల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే.. హాలీవుడ్‌ సినిమా 'ఫారెస్ట్‌ గంప్‌' రీమేక్‌ హక్కులు కొన్నట్టు తెలిపారు. అంత అద్భుత చిత్రానికి ఆమిర్‌ మాత్రమే న్యాయం చేయగలరని భావించా. అనుకున్నట్టుగానే ఈ సినిమా రీమేకైన 'లాల్‌సింగ్‌ చద్దా'లో తన మార్క్‌ నటన చూపించారు. అలా ఈ సినిమాని సమర్పించేందుకు ముందుకొచ్చా.

నాగార్జున: ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారు కదా. దానికి ఎలాంటి కసరత్తులు చేశారు?
ఆమిర్‌: కొన్ని పాత్రల కోసం వర్కౌట్స్‌ చేసి బరువు తగ్గా. ఈ సినిమాలోని నా క్యారెక్టర్‌ శారీరకంగా కాదు మానసికంగా సవాలు విసిరింది. అమాయకంతో కూడిన పాత్ర అది. హావభావాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.

నాగార్జున: తొలిసారి హిందీ సినిమాలో నటించటం ఎలా అనిపించింది?
నాగ చైతన్య: నాకు హిందీ తెలుసు. కానీ, ఓ నటుడిగా ఆ భాషలో నటించాలంటే ముందుగా కాస్త భయమేసింది. తెలుగు నేటివిటీలో సాగే పాత్ర కావడంతో కంఫర్ట్‌గా ఫీలయ్యా. నేనీ సినిమాలో గుంటూరు కుర్రాడిగా సుమారు 20నిమిషాలు కనిపిస్తా.

నాగార్జున: ఈ సినిమా ప్రయాణం ఎన్నాళ్లు సాగింది?
ఆమిర్‌: 14 ఏళ్ల క్రితమే ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. 8 సంవత్సరాల క్రితం రీమేక్‌ హక్కులు దక్కించుకున్నాం. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం.

నాగార్జున: ఆమిర్‌ నటించిన సినిమాల్లో ఏదైనా మీకు రీమేక్‌ చేయాలనిపించిందా?
చిరంజీవి: నా విషయంలో.. ఆమిర్‌ ఖాన్‌ చిత్రాలను రీమేక్‌ చేస్తే ఎదురుదెబ్బే. ఆయన సినిమాలను టచ్‌ చేయకుండా ఉండటమే మంచిది. చాలామంది నటులు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్‌ అవుతారు. ఆమిర్‌ ఖాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్‌ కారు. తాను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంత వరకూ ఆమిర్‌ నటిస్తూనే ఉంటారు.

ఇటీవలే ఆచార్యతో పలకరించిన చిరంజీవి ప్రస్తుతం ఇతర చిత్రాల షూటింగ్​ల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్​.. మోహన్​ రాజా దర్శకత్వంలో గాడ్​ ఫాదర్​, బాబీ డైరెక్షన్​లో వాల్తేర్​ వీరయ్య, మెహర్​ రమేశ్​ తెరకెక్కిస్తున్న బోళా శంకర్​ సినిమాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ వరుసగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి: యమా స్టైలిష్​గా మెగాస్టార్​ చిరంజీవి.. ఫొటోస్​ వైరల్​

'ఇది నాకు పునర్జన్మ.. ఆఖరి రక్తపుబొట్టు వరకు కష్టపడి పని చేస్తా'

Last Updated : Aug 9, 2022, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.