ETV Bharat / entertainment

సీసీఎల్​ 2023లో అదరగొట్టిన అఖిల్​.. 154 పరుగులు బాదిన కెప్టెన్ - సెలెబ్రిటీ క్రికెట్​ లీగ్ 2023

సెలెబ్రిటీ క్రికెట్​ లీగ్​(సీసీఎల్​) మళ్లీ మొదలైంది. రాయ్​పుర్​ వేదికగా తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో అక్కినేని అఖిల్​ అదరగొట్టాడు. 30 బంతుల్లో 91 పరుగులు చేసి అబ్బురపరిచాడు. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​ వివరాలు..

ccl 2023 telugu warriors kerala strikers

author img

By

Published : Feb 19, 2023, 9:35 PM IST

Updated : Feb 20, 2023, 9:03 AM IST

సెలెబ్రిటీ క్రికెట్​ లీగ్​ (సీసీఎల్​) మళ్లీ మొదలైంది. దాదాపు రెండేళ్ల తర్వాత శనివారం తిరిగి ప్రారంభమైంది. కాగా, ఆదివారం రాయ్​పుర్​ స్టేడియం వేదికగా తెలుగు వారియర్స్​-కేరళ స్ట్రైకర్స్​ మధ్య లీగ్​ మూడో మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో యువ కథానాయకుడు అక్కినేని అఖిల్​ నాయకత్వం వహిస్తున్న తెలుగు వారియర్స్​ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్​లో అఖిల్​ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్​లో 91, రెండో ఇన్నింగ్స్​లో 63 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే, ప్లేయర్లను ఎంకరేజ్​ చేయడానికి ప్రముఖ సినీ నటులు వెంకటేశ్​​ తదితరులు వచ్చారు.

టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన తెలుగు వారియర్స్​.. మొదటి ఇన్నింగ్స్​లో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్​ కెప్టెన్ అక్కినేని అఖిల్​ సూపర్​ ఇన్నింగ్స్​ ఆడి 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. మరో ప్లేయర్​ ప్రిన్స్​ 23 బంతుల్లో 45 పరుగులు చేసి రాణించాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్​ లీడ్​తో కేరళ జట్టుకు 170 పరుగులు లక్ష్యన్ని నిర్దేశించింది తెలుగు టీమ్​. అనంతరం బ్యాటింగ్​కు దిగిన కేరళ జట్టు.. ఆఖరి ఓవర్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఆ ఓవర్​లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. దీంతో తెలుగు వారియర్స్​ 64 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్​ మొదలయ్యే ముందు నందమూరి తారకరత్న మరణం పట్ల ప్లేయర్స్​ సంతాపం తెలిపారు.

ccl 2023 telugu warriors kerala strikers
అఖిల్ అక్కినేని

క్రీజులోనే కూర్చున్న నాన్ స్ట్రైకర్​..!
ఈ మ్యాచ్​లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అఖిల్​ అక్కినేని బ్యాట్​కు పని చెబుతూ.. స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు. మరోవైపు, నాన్​ స్ట్రైకర్​ ఎండ్​లో ఉన్న బ్యాటర్​ క్రీజులోనే కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో.. అఖిల్,​ ఇండియన్ క్రికెట్​ టీమ్​లో జాయిన్​ అయితే బాగుంటుంది అంటూ కామెంట్​ రాసుకొచ్చాడు.

క్రీజులోనే కూర్చున్న నాన్​ స్ట్రైకర్

ఫార్మాట్​ ఇదే..
ఈ సెలెబ్రిటీ క్రికెట్​ లీగ్​ మ్యాచ్​లు సాధారణ టీ20 మ్యాచ్​ల్లా జరగవు. ఈ మ్యాచ్​ల్లో టెస్టు క్రికెట్​ తరహాలో పరిమిత ఓవర్ల ఇన్నింగ్స్​ ఉంటాయి. అంటే.. ఒక్కో ఇన్నింగ్స్​ 10 ఓవర్లు ఉంటుంది. అలా ఇరు జట్లు రెండేసి ఇన్నింగ్స్​ ఆడతాయి. మిగతా అంతా టెస్టు క్రికెట్​ మాదిరిగానే ఉంటుంది. దీంతో పాటు ఒక టీమ్​ ఇన్నింగ్స్​ పూర్తైన తర్వాత మరో జట్టు 5 నిమిషాల లోపు మైదానంలో ఉండాలనేది రూల్​.

తెలుగు వారియర్స్ జట్టు : అఖిల్​ అక్కినేని(కెప్టెన్), సచిన్​ జోషి, అశ్విన్​ బాబు, ధరమ్​, ఆదర్శ్, నంద కిషోర్​, నిఖిల్, రఘు, సమ్రాట్​, తరుణ్​, విశ్వ, ప్రిన్స్​, సుశాంత్​, ఖయ్యుం, హరీష్​

Last Updated : Feb 20, 2023, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.