బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. దిల్లీలోని ఆమె ఇంట్లో నగదు, విలువైన ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.1.41 కోట్లు ఉంటుందట. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాలా గోప్యంగా ఉంచి.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దిల్లీలోని సోనమ్ కపూర్ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు తొమ్మిది మంది కేర్‌టేకర్స్, డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దొంగతనం అనంతరం.. ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు చోరీ జరిగిందన్న విషయం తెలిసిందట. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. ఇదిలా ఉంటే.. గర్భవతిగా ఉన్న సోనమ్ ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటోంది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సోనమ్.. బేబీ బంప్ ఫొటోలను ఇటీవల షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే దిల్లీలోని ఇంట్లో సోనమ్ భర్త ఆనంద్‌తోపాటు అతని అహుజా తలిదండ్రులు, నానామ్మ సరళ ఉంటున్నారు.
ఇదీ చూడండి: 'సలార్'కు సీక్వెల్.. ప్రశాంత్ నీల్ ఈ సారి ఏమన్నారంటే?