ETV Bharat / entertainment

Hritik Wishes Ntr: 'యుద్ధభూమిలో కలుద్దాం'.. 'దేవర'కు బాలీవుడ్ స్టార్ స్పెషల్ విషెస్! - jr ntr prashanth neel movie special poster

Jr Ntr Birthday : టాలీవుడ్ యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్టీఆర్​ బర్త్​డే సందర్భంగా సోషల్ మీడియాలో ఈ స్టార్​ హీరోకు విషెస్​ వెల్లువ కొనసాగుతోంది. అయితే బాలీవుడ్​ స్టార్​ హృతిక్​ చేసిన స్పెషల్​ విష్​ మాత్రం ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

war 2
war 2 jr ntr
author img

By

Published : May 20, 2023, 12:56 PM IST

Hritik Wishes Ntr : మే 20న జూనియర్​ ఎన్టీఆర్ బర్త్​డే సందర్భంగా పలువురు స్టార్స్​ ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా విషెస్​ తెలిపారు. అయితే అందరిలానే విష్​ చేసినప్పటికీ ఓ స్టార్​ హీరో చేసిన ట్వీట్​ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్​ స్టార్​ 'వార్' హీరో హృతిక్​ రోషన్​. ఆయన తెలుగులో ఎన్టీఆర్​కు బర్త్​డే విషెస్ చెప్పి ఫ్యాన్స్​ను ఆశ్చర్యపరిచారు.

" హ్యాపీ బర్త్ డే తారక్. ఈ ఏడాది నీకు ఆనందంగా, యాక్షన్​గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ ట్వీట్​ చేశారు. రాశాడు. దీంతో ఆయన కచ్చితంగా వార్​ సినిమా గురించే ఇందులో ప్రస్థావించారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వార్ అనే పదం వాడకుండా యుద్ధభూమి అని రాయడం వల్ల ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.

  • Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace

    …until we meet 😉

    Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻

    — Hrithik Roshan (@iHrithik) May 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక సినిమా విషయానికి వస్తే.. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన సూపర్​ హిట్ సినిమా 'వార్​'కు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. దీన్ని 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కాగా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్​.. ఈ సినిమాను సిల్వర్​ స్క్రీన్​పై తీసుకురానుంది.

మరోవైపు ఎన్టీఆర్​ మూవీ లైనప్​ను పరిశీలిస్తే.. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్​ 30 అనే వర్కింగ్​ టైటిల్​తో ఇంకాలం షూటింగ్​ జరుపుకున్న ఈ సినిమా.. ఎన్టీఆర్​ బర్త్​డే సందర్భంగా..'దేవర'గా రూపాంతరం చెందింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో ఓ సినిమాలో నటిస్తున్నారు.

అయితే గత కొద్ది కాలంగా జూనియర్​ ఎన్టీఆర్ బాలీవుడ్​లోకి ​ ఎంట్రీ ఇస్తున్న విషయం గురించి పలు వార్తలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి. హృతిక్​ రోషన్,​ టైగర్ ష్రాఫ్​ నటించిన బ్లాక్​ బస్టర్​ మూవీ 'వార్' సీక్వెల్​లో ఆయన నటిస్తున్నట్లు టాక్ కూడా​ నడిచింది. కానీ ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు. అయితే లేటెస్ట్​గా ట్రెండ్​ అవుతున్న ఈ ట్వీట్​ ఇప్పుడు సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Ntr 31 poster : జూనియర్ ఎన్టీఆర్​ బర్తడే స్పెషల్​గా ఓ తాజా అప్డేట్​ను వచ్చేసింది. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NTR 31' సినిమా 2024 మార్చి నుంచి షూటింగ్ మొదలవ్వనున్నట్లు ఆ చిత్ర యూనిట్​ ట్వీట్టర్​ వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్​ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.