ETV Bharat / entertainment

ఆ సినిమా బాలయ్యతో కాదా.. రజనీతోనా? - వశిష్ఠ రజనీకాంత్​

'బింబిసార' దర్శకుడు వశిష్ఠ​.. తన తదుపరి సినిమా బాలకృష్ణతో చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ వశిష్ఠ.. సూపర్​స్టార్​ రజనీకాంత్​తో చేయనున్నారని దక్షిణాది వర్గాల్లో టాక్​ వినిపిస్తోంది.

rajinikanth
ఆ సినిమా బాలయ్యతో కాదా.. రజనీతోనా
author img

By

Published : Oct 20, 2022, 2:22 PM IST

Updated : Oct 20, 2022, 7:31 PM IST

Bimbisara Director Rajnikanth: ఎన్నో రోజులుగా హిట్​ కోసం ఎదురుచూస్తున్న హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌కు 'బింబిసార' మంచి విజయాన్ని అందించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 5న రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్​ వద్ద సూపర్​ హిట్​ టాక్​ సంపాదించుకుంది. టైమ్​ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు ఫాంటసీ డ్రామాను జోడించి దర్శకుడు వశిష్ఠ​ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. పేరుకే డెబ్యూ సినిమానే అయినా.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో వశిష్ఠ​ పేరు మార్మోగిపోయింది.

అయితే ఆయన తదుపరి సినిమా ఎవరితో చేయనున్నారనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ముందుగా కల్యాణ్‌రామ్‌తో బింబిసార-2 తెరకెక్కించాలని ఆయన ప్లాన్‌ చేసుకున్నారట. కానీ కల్యాణ్​రామ్​ ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు పూర్తయిన తర్వాతే 'బింబిసార-2' పట్టాలెక్కనుంది. ఈలోపు వశిష్ఠ మరో పెద్ద సినిమా చేయాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే ఆయన బాలకృష్ణతో సినిమా ప్లాన్ చేస్తారని అభిమానులు భావించారు. కానీ ఆయనేమో.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు స్టోరీ వినిపించారట. అయితే రజనీ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని టాక్‌. ప్రస్తుతం రజనీ.. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో 'జైలర్' సినిమా చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Last Updated : Oct 20, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.