Bhagavanth Kesari 3 Weeks Collections : సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటి శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో 21 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
రూ.67.35 కోట్ల బిజినెస్..
'భగవంత్ కేసరి' తాజాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించింది. ఈ మూడు వారాల్లో సినిమాకి నైజాంలో రూ.14.50 కోట్లు, సీడెడ్‌లో రూ.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8 కోట్లు, తూర్పూ గోదావరిలో రూ.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.4 కోట్లు, గుంటూరులో రూ.6 కోట్లు, కృష్ణాలో రూ.4 కోట్లు, నెల్లూరులో రూ.2.60 కోట్లు, కర్నాటక సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ.4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.6 కోట్లు. ఇవన్నీ కలిపి వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.67.35 కోట్ల బిజినెస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
'భగవంత్ కేసరి'కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ.18.36 కోట్లు, సీడెడ్‌లో రూ.13.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.6.29 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.30 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.2.71 కోట్లు, గుంటూరులో రూ.5.25 కోట్లు, కృష్ణాలో రూ.3.03 కోట్లు, నెల్లూరులో రూ.2.47 కోట్లు. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి.. రూ.55.37 కోట్ల షేర్లు, రూ.94.80 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
మొత్తంగా రూ.140 కోట్ల గ్రాస్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని రూ.55.37 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా.. విదేశాల్లోనూ దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా రూ.5.87 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7.28 కోట్లు వసూళ్లు చేసిన 'భగవంత్ కేసరి'.. 21 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.68.52 కోట్ల షేర్, రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. భారీ అంచనాలతో విడుదలైన 'భగవంత్ కేసరి'కి ప్రపంచ వ్యాప్తంగా రూ.67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా దాటి మూడు వారాలకు రూ.68.52 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది.
హ్యాట్రిక్ హిట్స్..
తండ్రీ - కూతురు సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. దీంతో మునుపెన్నడు లేనంత విధంగా కలెక్షన్స్ సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది బాలయ్య మూవీ. ఇక 'అఖండ', 'వీర సింహారెడ్డి'లతో వరుసగా రెండు హిట్స్ అందుకున్న బాలయ్య 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
-
2 HOURS TO GO 🕺💃#BhagavanthKesari BOXOFFICE KA SHER CELEBRATIONS Today from 5PM onwards at JRC Conventions, Hyderabad💥
— Shine Screens (@Shine_Screens) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch Live here!
- https://t.co/IagSO5VCqy#BlockbusterBhagavanthKesari 🔥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman… pic.twitter.com/O0zk9GPA27
">2 HOURS TO GO 🕺💃#BhagavanthKesari BOXOFFICE KA SHER CELEBRATIONS Today from 5PM onwards at JRC Conventions, Hyderabad💥
— Shine Screens (@Shine_Screens) November 9, 2023
Watch Live here!
- https://t.co/IagSO5VCqy#BlockbusterBhagavanthKesari 🔥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman… pic.twitter.com/O0zk9GPA272 HOURS TO GO 🕺💃#BhagavanthKesari BOXOFFICE KA SHER CELEBRATIONS Today from 5PM onwards at JRC Conventions, Hyderabad💥
— Shine Screens (@Shine_Screens) November 9, 2023
Watch Live here!
- https://t.co/IagSO5VCqy#BlockbusterBhagavanthKesari 🔥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman… pic.twitter.com/O0zk9GPA27
'ఆరోగ్యం దెబ్బతింది, సినిమాలు ఫ్లాప్, విడాకుల సమస్య'- సమంత ఎమోషనల్
సల్మాన్ ఖాన్ 'టైగర్-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా?