ETV Bharat / entertainment

నవంబర్​లో సెట్స్ మీదకు 'NBK 108'.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్​! - బాలయ్య ఎన్​బీకే 108 అప్డేట్​

నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'NBK 108' షూటింగ్ నవంబరు నెలలో స్టార్ట్ కానుందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఆ మూవీని విడుదల చేసేలా మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట. ఆ వివరాలు..

Hero Balakrishna New Movie NBK 108
Hero Balakrishna New Movie NBK 108
author img

By

Published : Oct 6, 2022, 5:02 PM IST

Hero Balakrishna New Movie NBK 108: స్పీడుగా సినిమాలు చేయడం నటసింహం నందమూరి బాలకృష్ణ స్టైల్. ఒక్కసారి ఆయన కమిట్ అయ్యారంటే.. వెనక్కి తిరిగి చూసేది ఉండదు. చకచకా సినిమా పూర్తి చేస్తారు. గత ఏడాది చివర్లో 'అఖండ'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి, ఆ తర్వాత కూడా ఆ సినిమా థియేటర్లలో ఆడింది. దాని తర్వాత రెండు సినిమాలకు బాలకృష్ణ ఓకే చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. మరో సినిమాను నవంబర్‌లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారట.

నవంబర్‌లో సెట్స్ మీదకు NBK 108
బాలకృష్ణ కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ పతాకంపై NBK 108(వర్కింగ్​ టైటిల్​) సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు హరీశ్​ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు కాగా.. బాక్సాఫీస్ బరిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకుడు. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.

టర్కీలో శ్రుతిహాసన్​తో సాంగ్​ షూట్​..
గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కోసం ఆగస్టు నెలాఖరులో బాలకృష్ణ టర్కీ వెళ్లారు. ఇస్తాంబుల్‌లో శ్రుతి హాసన్‌తో ఒక పాట, విలన్లతో ఒక ఫైట్, కొన్ని కామెడీ సీన్లు చేశారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత 'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ సీజన్ కోసం టీజర్, ట్రైలర్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో ఎపిసోడ్స్ షూటింగ్ కూడా చేస్తారట. అవి పూర్తైన తర్వాత 'ఎన్‌బీకే 108' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

తండ్రీకుమార్తెల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలయ్య కుమార్తెగా 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల నటించనున్నారు. మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్, క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్‌గా ఉంటాయని సినీ వర్గాల సమాచారం.

'అన్‌స్టాప‌బుల్‌ 2' టీజర్​ ప్రోమో​, యాంథమ్‌కు సూపర్ రెస్పాన్స్
ఇటీవలే 'అన్‌స్టాప‌బుల్‌ 2' టీజర్​ ప్రోమో విడుదలైంది. దానికి కొద్దిరోజుల ముందు 'అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్' కూడా వచ్చింది. ఆ రెండింటికీ మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా టీజర్​ ప్రోమోలో బాలకృష్ణ గెటప్​కు మంచి ప్రశంసలు వచ్చాయి. 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2'లో ఫస్ట్‌ గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్​ రాబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి: SSMB 28 క్రేజీ అప్డేట్​.. మహేశ్​ బాబు@ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!

'పొన్నియన్‌ సెల్వన్‌' వివాదం.. కమల్‌ సెన్సేషనల్​ కామెంట్స్​.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.