Ballayya Boyapati Movie: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు పెద్ద కమర్షియల్ సినిమాలుగా గుర్తింపు తేవడమే కాకుండా ఆయన కెరీర్లో సూపర్ హిట్ చిత్రాలుగాను నిలిచాయి. అందుకే ఈ కాంబో మళ్లీ రిపీట్ అయితే బాగుంటుందని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి కూడా అదే పనిలో ఉన్నారని సమాచారం.
బాలయ్య, బోయపాటి కాంబోలో కొత్త సినిమా అనగానే అందరూ అఖండ-2 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఆ మధ్య ఓ రియాలిటీ షోలో బోయపాటి స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే కథ విషయంలో బాలయ్య ఓ షరతు పెట్టారని టాలీవుడ్లో టాక్. లెజెండ్ రేంజ్లో పొలిటికల్ స్టోరీ ఉండాలని బాలయ్య కోరుకుంటున్నారట. అందుకు బోయపాటి కూడా సరే అన్నారని సమాచారం.
ప్రస్తుతం బోయపాటి.. ఎనర్జిటిక్ హీరో రామ్‌తో మూవీ కమిట్ అయ్యారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మరో వైపు బాలయ్య కూడా గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి సినిమా సెట్లో అడుగుపెట్టాలని అనుకుంటున్నారట. ఆలోపు బోయపాటి ఓ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీ రెడీ చేయాల్సి ఉంటుంది. ఇక బాలయ్య- బోయపాటి కాంబో నాలుగో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవీ చదవండి: దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..