ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న బలగం మూవీ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. ఉక్రెయిన్‌లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ సినిమాకు బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ దిల్ రాజు ప్రొడక్షన్స్ హౌస్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. "అన్ని అడ్డంకులు దాటుకొని, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'బలగం' చిత్రానికి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది" అంటూ మూవీ టీమ్ రాసుకొచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకోవడం పట్ల అభిమానులతో పాటు చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కన్నీరు పెట్టుకున్న ఊరి జనం..
ఇటీవలే ఈ సినిమాను తెలంగాణలోని పలు పల్లెటూర్లలో ప్రదర్శించారు. మునపటి కాలంలా వీధుల్లో తెరలు కట్టి ప్రదర్శించారు. అలా తాజాగా ఓ ఊరిలో ఈ చిత్రాన్ని తెర కట్టి ప్రదర్శించగా.. దాన్ని చూసిన గ్రామస్థులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా క్లైమాక్స్ సమయానికి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఆ ట్వీట్‌పై స్పందించిన 'బలగం' హీరో ప్రియదర్శి.. 'ఇది నా సినిమానా' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు. ఇక చిత్ర దర్శకుడు వేణు కూడా సైతం ఆ ట్వీట్‌పై స్పందించారు. "నా బలగం ప్రేక్షకులని ఇలా కదిలిస్తుంది అని వీడియోస్ నాకు పంపిస్తుంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా చూసి మళ్లీ థియేటర్లకు ఫ్యామిలీ తో వెళ్లి చూస్తున్నాం అంటూ పిక్స్ పంపుతున్నారు. ఆనందభాష్పలతో మీ వేణు" అంటూ రిప్లై ఇచ్చారు.
-
Idhi naa cinema na🥲#Balagam https://t.co/yStQ4EaZly
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) April 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Idhi naa cinema na🥲#Balagam https://t.co/yStQ4EaZly
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) April 2, 2023Idhi naa cinema na🥲#Balagam https://t.co/yStQ4EaZly
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) April 2, 2023
ఇక సినిమా విషయానికి వస్తే.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతూ తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ పలు అవార్డులను సొంతం చేసుకుంటోంది. 'జబర్దస్త్' ఫేమ్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ప్రియదర్శి - కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్ పతాకంపై హన్షిత్, హర్షిత ఈ సినిమాకు నిర్మాతలగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లతో పాటు ప్రముఖ ఓటీటీలో ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో ఉంది.