Atlee Vs Sandeep : పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో డైరెక్టర్లు కూడా తమ సినిమాలను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తమ చిత్రాల కోసం ఇతర భాష నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇతర భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్నారు. సౌత్ , నార్త్ అన్న భేదాలు లేకుండా తమ ట్యాలెంట్‌తో అక్కడ కూడా దూసుకెళ్తున్నారు. ఇటీవలే తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా అందుకు నిదర్శనం. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఆ చిత్రం హిందీతో పాటు అన్ని భాషల్లో విశేషాదరణ అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షలను సాధించింది. దీంతో అట్లీ పేరు నార్త్‌లో మారుమోగిపోయింది. అప్పటివరకతుు సౌత్‌కు పరిమితమైన ఈ స్టార్ డైరెక్టర్.. ఒక్క సారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులరైపోయారు.
అయితే 'జవాన్'కి ముందే మన సౌత్ నుంచి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా 'కబీర్ సింగ్' సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 'అర్జున్ రెడ్డి'కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కగా.. అప్పటి వరకు ఉన్న సందీప్ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచేసింది. అంతే కాకుండా షాహిద్ కపూర్‌కు సాలిడ్ హిట్ పడటం వల్ల అందరి దృష్టి ఈ యంగ్ డైరెక్టర్‌పై పడింది. ఇక ఇదే జోరుతో సందీప్ ఇప్పుడు యానిమల్ సినిమాతో బాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.
ఇక 'జవాన్' సినిమా సౌత్ ఇండియాలో దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లను నమోదు చేసి రికార్డుకెక్కింది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 'యానిమల్' మూవీకి అన్ని భాషల్లో కలిపి కచ్చితంగా రూ.200 కోట్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ ఇది నిజమైతే సౌత్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేయనున్న హిందీ సినిమాగా 'యానిమల్' రికార్డుకెక్కనుంది. చూడాలి ఈ సారి బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలవనున్నారో ?
'యానిమల్' రన్‌టైమ్ 3.20 గంటలు! - బాలీవుడ్లో ఇదే లాంగెస్ట్ మూవీ బాస్!