ETV Bharat / entertainment

మానస్-విష్ణు ప్రియ 'గంగులు' ఫోక్ సాంగ్.. మాస్​ స్టెప్పులతో ఆదరగొట్టేశారుగా! - విష్ణు ప్రియ గంగులు ఫోక్ సాంగ్​

బిగ్ బాస్ ఫేమ్ మానస్- యాంకర్​ విష్ణు ప్రియ కలిసి చిందులేసిన 'గంగులు' ఫోక్​ సాంగ్ తాజాగా విడుద‌లై అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మీరు చూశారా?

anchor Vishnu priya Manas Gangulu Full  folk song released
మానస్-విష్ణుప్రియ 'గంగులు' ఫోక్ సాంగ్
author img

By

Published : Apr 12, 2023, 11:27 AM IST

Updated : Apr 12, 2023, 12:10 PM IST

గత కొద్ది కాలంగా ఆడియెన్స్​లో ఫోక్ సాంగ్స్​కు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ జానపదాలు ప్రేక్షకుల నాడి పట్టాయి. వీక్షకుల నాలుకలపై నాట్యమాడుతున్నాయి. అలానే సోషల్​మీడియాలోనూ ఫుల్ ట్రెండ్​ అవుతూ కోట్ల వ్యూస్​తో మేకర్స్​కు సిరులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జానపద పాటలకు మంచి గుర్తింపు వస్తోంది. యూత్​ సెల్​ఫోన్స్​లో, పెళ్లి మండపాల్లో, ప్రైవేటు పార్టీల్లో.. ఇలా ప్రతి చోటా ఈ పాటలే సందడి చేస్తున్నాయి. ఈ ఫోక్​ బీట్​కు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం స్టెప్పులేస్తూ ఎంజాయ్​ చేస్తున్నారు. సినిమాల్లోనూ ఈ జానపద పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ పాటలతో బుల్లితెర స్టార్స్ కూడా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో యాంకర్ విష్ణుప్రియ-బిగ్​బాస్​ ఫేమ్​ మానస్ కలిసి 'జరీ జరీ' పంచెకట్టు ఫోక్ సాంగ్‏కు స్టెప్పులేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్​మీడియాలో ఫుల్​ ట్రెండ్​ అయింది. ఆడియెన్స్​ను తెగ ఊర్రూతలూగించింది. మిలియన్ వ్యూస్ దక్కించుకుని పాపులర్​ అయింది.

అయితే తాజాగా మానస్- విష్ణు ప్రియ కలిసి మరోసారి ఇంకో ఫోక్​ సాంగ్​ కోసం జత కట్టారు. 'గంగులు' అనే జానపద పాట కోసం ఇద్దరు కలిసి చిందులేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్​ వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఆ పాట ఫుల్ సాంగ్​ కోసం వెయిట్​ చేశారు. ఇప్పుడు ఫుల్​ సాంగ్​ను నివ్రితి వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ రిలీజ్​ చేశారు. అది కూడా ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది. తెగ ఉర్రూతలూగిస్తోంది. ఈ వీడియో సాంగ్​లో మాసన్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. వీరి కెమిస్ట్రీ కూడా బాగుంది. ఈ పాటకు తరుణ్ సైదులు లిరిక్స్ రాయగా, స్వరాజ్ కీర్తన్ ఆలపించారు. భీమ్స్ సిసిరిలియో సంగీత అందించారు. ప్రముఖ కోరియెగ్రాఫర్ జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ.. ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‏లో ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూస్​ వస్తున్నాయి. ఇకపోతే ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ రావ‌డం ప‌ట్ల టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.

స్వచ్ఛమైన తెలుగు పదాలతో వచ్చిన ఈ జానపద పాట ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది అని పాటను రిలీజ్​ చేసేటప్పుడు మానస్​ అన్నారు. అదే సమయంలో విష్ణుప్రియా మాట్లాడుతూ.. "మానస్‌‌తో కలిసి అంతకుముందు చేసిన 'జరీ జరీ పంచె కట్టు' సాంగ్​కు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు 'గంగులు' పాట కూడా హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వామ్మో.. బిగ్​బాస్​ పింకీ నువ్వేనా.. ఇంత హాట్​గా ఎప్పుడు చూడలే!

Last Updated : Apr 12, 2023, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.