ETV Bharat / entertainment

రామ్​​చరణ్​తో ఆనంద్​ మహీంద్రా డ్యాన్స్​.. వీడియో వైరల్ - రామ్​చరమ్ ఆనంద్​ మహీంద్ర​ నాటు నాటు డ్యాన్స్

హైదరాబాద్​లో జరుగుతున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​తో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్​ మహీంద్రా నాటునాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్​ చేశారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

ran charan mahindra natu natu dance
ran charan mahindra natu natu dance
author img

By

Published : Feb 11, 2023, 8:41 PM IST

Updated : Feb 11, 2023, 8:49 PM IST

హైదరాబాద్​లో జరిగిన ఫార్ములా-ఈ రేస్​లో మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సందడి చేశారు. రేసు చూడటానికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​తో కలిసి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటునాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్​ వేశారు. ఫార్ములా-ఈ రేసులో తనకు ఓ బోనస్ దొరికిందని, రామ్ చరణ్ దగ్గర నాటు నాటు పాట బేసిక్ స్టెప్స్ నేర్చుకున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' లోని నాటునాటు పాట ఆస్కార్ అందుకోవాలని ఆకాంక్షిస్తూ రామ్​చరణ్​కు ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు.

ఈ ఫార్ములా-ఈ రేసింగ్‌ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. క్రీడాకారులు సచిన్‌ తెందుల్కర్, శిఖర్​ ధావన్​ తదితరులు వచ్చారు. ఇక, సినీ తారలు నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, నాగార్జున తదితరులు రేసింగ్ జరుగుతున్న హుస్సేన్‌సాగర్ తీరానికి విచ్చేశారు. గ్యాలరీ నుంచి.. భారత్‌కు చెందిన మహీంద్రా టీమ్​కు సపోర్ట్ చేశారు. వీరితోపాటు రేసింగ్ చూసేందుకు వచ్చిన జనంతో హుస్సేన్‌సాగర్ తీరం కిక్కిరిసిపోయింది. కాగా, ప్రస్తుతం రామ్​చరణ్.. శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్​​సీ15' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్​లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన చార్మినార్​ వద్ద షూటింగ్​ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కర్నూల్​లో జరుగుతోంది.

Last Updated : Feb 11, 2023, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.