ETV Bharat / entertainment

అమితాబ్ బచ్చన్​కు గాయం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు - అమితాబ్ బచ్చన్​ కొత్త సినిమాలు

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​కు కేబీసీ షోలో గాయం అయ్యింది. ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన తన బ్లాగ్​లో వివరాలు వెల్లడించారు. ఏం జరగిందంటే..

amitabh bachchan latest news today
amitabh bachchan cut leg
author img

By

Published : Oct 23, 2022, 1:19 PM IST

​బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్​కు​ 'కౌన్​ బనేగా కరోడ్ పతి' షోలో గాయం అయింది. ఈ మేరకు అమితాబ్​ తన బ్లాగ్​లో వివరాలు వెల్లడించారు. షో చేస్తున్న సమయంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి నరం కట్​ అయిందని చెప్పారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. రక్త స్రావాన్ని ఆపడానికి కొన్ని కుట్లు కూడా వేశారని తెలిపారు. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాని.. అభిమానులు ఆందోళని చెందవద్దని కోరారు బిగ్ బీ.
"ఇనుప ముక్క తగిలి నరం కట్​ అయింది. రక్త స్రావం కూడా జరిగింది. రక్తా స్రావాన్ని ఆపడానికి కుట్లు వేశారు. షో స్టాఫ్​ టీమ్​, డాక్టరు అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు వాకింగ్​ లాంటివి చేయొద్దని డాక్టర్లు చెప్పారు" అని అమితాబ్​ బచ్చన్ అన్నారు.

చివరిసారిగా బిగ్​బీ అయాన్​ ముఖర్జీ తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సూరజ్​ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న 'ఉంచాయి' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నీనా గుప్తా, అనుపమ్​ ఖేర్, పరిణీతి చోప్రా, బోమన్​ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్​ 11న విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి : ముని గెటప్​లో ప్రభాస్​ రేర్ ఫొటోస్​ చూశారా

ఆమె 11 ఏళ్ల పోరాటంతో 'వాణిశ్రీ' చట్టం.. అనేక మంది అభాగ్యులకు లాభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.