ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు థ్యాంక్స్​ చెప్పిన అమితాబ్​.. నన్ను కలవడానికి ఎవరూ రావద్దంటూ.. - అమితాబ్​ బచ్చన్​ గాయాలు

'ప్రాజెక్ట్​ కె' షూటింగ్​లో భాగంగా గాయాలపాలైన అమితాబ్​ బచ్చన్​.. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గాయాలకు పట్టీలు వేశారని.. కోలుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలిపారు. కాగా, తనను ఎవరూ కలిసేందుకు రావద్దని కోరారు.

amitabh bacchan
amitabh bacchan project k
author img

By

Published : Mar 7, 2023, 12:54 PM IST

Updated : Mar 7, 2023, 2:03 PM IST

బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​ సోషల్​ మీడియా​ వేదికగా తన అభిమానులకు కృతజ్ఞత తెలిపారు. త్వరగా కోలుకోవలంటూ ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే గాయం కోలుకోనేందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలిపిన అమితాబ్​.. డాక్టరు చెప్పిన సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తున్నానని అన్నారు. ముంబయిలోని తన నివాసంలో హోలీ చేసుకున్న ఆయన.. అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్​లో 'ప్రాజెక్టె కె' చిత్రీకరణలో భాగంగా యాక్షన్​ సీన్స్​ చేస్తున్న బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​.. షూట్​ సమయంలో గాయపడ్డారు. మూవీ టీమ్​ ఆయన్ను స్థానిక ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు సీటీ స్కాన్​ తీశారు. దీంతో ఆయన పక్కటెముకలు విరిగినట్లు రిపోర్ట్ లో స్పష్టమైంది. అనంతరం అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన అమితాబ్​.. ముంబయిలోని తన నివాసానికి చేరుకున్నారు.

డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు సామాజిక మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. పక్కటెముకలు విరిగిన కారణంగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. అభిమనులను ఆందోళన చెందవద్దని.. తనను కలిసేందుకు ఇంటి వద్దకు రావద్దని కోరారు.
ఇక 'ప్రాజెక్టు కె' విషయానికి వస్తే.. వైజయంతి మూవీస్​ పతాకంపై తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్​కు.. నాగ్​ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​తో పాటు, బాలీవుడ్​ బ్యూటీ దీపిక పదుకొణె, అమితాబ్​ బచ్చన్​ నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 12 థియేటర్లలో సందడి చేయనుంది.

అమితాబ్ బచ్చన్​.. టాలీవుడ్​లో 'ప్రాజెక్ట్​ కె' తో పాటు బాలీవుడ్​ లోనూ పలు సినిమాలకు సైన్​ చేశారు. బీ టౌన్​ హీరో టైగర్​ ష్రాఫ్​తో 'గణపత్' అనే సినిమాలో నటించనున్నారు. ఆ తర్వాత వరుణ్​ ధావన్, జాన్వీ కపూర్​తో కలయికలో వస్తున్న 'రణ్​భూమి' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు, 'పింక్​', 'బద్లా' లాంటి బీ టౌన్​ బ్లాక్​ బస్టర్​ మూవీస్​కు దర్శకత్వం వహించిన దర్శకుడు రిభు దాస్​ గుప్త.. తన తర్వాతి​ ప్రాజెక్ట్​ 'సెక్షన్​ 84'లో అమితాబ్​కు ఓ కీలక పాత్ర ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

amitabh bacchan
అమితాబ్​ థ్యాంక్యూ నోట్​

Last Updated : Mar 7, 2023, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.