ETV Bharat / entertainment

షార్ట్​ఫిల్మ్​లో అల్లుఅర్జున్​.. దర్శకుడిగా సుకుమార్​ - అల్లుఅర్జున్​ పుష్ప మూవీ

ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​.. దర్శకుడు సుకుమార్ కాంబినేషనలో ఓ షార్ట్ ఫిల్మ్​ తెరకెక్కింది. మీరు చూడకపోయి ఉంటే ఓ సారి చూసేయండి..

short film alluarjun
షార్ట్​ఫిల్మ్​లో అల్లుఅర్జున్​
author img

By

Published : Sep 13, 2022, 3:37 PM IST

ప్రస్తుతం పుష్ప సూపర్​ సక్సెస్​ను ఎంజాయ్​ చేస్తూనే.. తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రితో సినీ కెరీర్​ను ప్రారంభించిన ఆయన సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగాడు. అయితే ఇన్నేళ్ల తన జర్నీలో బన్నీ ఓ షార్ట్​ ఫిల్మ్​లో నటించాడని మీకు తెలుసా? అది కూడా సుకుమార్​ దర్శకత్వంలోనే. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఐ యామ్​ దట్​ చేంజ్​ అనే టైటిల్​తో ఈ షార్ట్​ ఫిల్మ్​ రిలీజ్​ అయింది. సామాజిక అంశంతో రూపొందిన ఈ లఘుచిత్రానికి బన్ని నిర్మాతగా కూడా వ్యవహరించారట. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రంలో "మన బాధ్యతను మనం నిర్వర్తించడం కూడా దేశభక్తే. మార్పు మనతోనే మొదలవుతుంది. ఆ మార్పు నేనే" అంటూ బన్నీ చెప్పారు. ఓ సారి ఆ వీడియోను మీరూ చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఇటీవలే ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్​లో పుష్ప సినిమా అదరగొట్టింది. గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సైమా అవార్డుల్లోనూ సత్తా చాటింది. మొత్తం 12 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకోగా, ఆరింటిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి.

ఇదీ చూడండి: లాకప్​లో నటుడు.. పదిరోజులు తిండి తినకుండా నీటితోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.