ETV Bharat / entertainment

Pushpa 2: 'పుష్ప ఎక్కడ?'.. ఇదిగో సమాధానం వచ్చేసింది! - Pushpa 2 The Rule Trailer Video

'పుష్ప:ది రూల్‌'​ మూవీకి సంబంధించి ఓ కీలక అప్డేట్​ వచ్చింది. 'వేర్​ ఈజ్​ పుష్ప' పేరుతో ఈ సినిమా టీజర్​ను చిత్రబృందం రిలీజ్​ చేసింది​.

Pushpa 2 The Rule Movie Update
పుష్ప 2 ది రూల్ మూవీ అప్డేట్
author img

By

Published : Apr 7, 2023, 4:22 PM IST

Updated : Apr 7, 2023, 6:37 PM IST

పాన్​ ఇండియన్​ స్టార్​ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'పుష్ప:ది రూల్‌'​. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్​ను చిత్ర బృందం పంచుకుంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప ఎక్కడ?'.. అంటూ ఓ వీడియోను శుక్రవారం విడుదల చేసింది.

అయితే పుష్ప-2 టీజర్​లో కథకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచేందుకే దీనిని విడుదల చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ టీజర్​లో తిరుపతి జైలు నుంచి పుష్ప రాజ్ తప్పించుకున్నట్లు.. అతడిని పట్టుకోవడానికి పోలీసుల గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే సీన్లను చూపించారు. మూడు నిమిషాల 14 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ను కేవలం రెండు షాట్​లలో మాత్రమే చూపించారు. ఈ వీడియోను చూస్తుంటే 'వేర్​ ఈజ్​ పుష్ప' అనే అంశం చుట్టే మొత్తం సినిమా స్టోరీ నడుస్తుందా అని అనిపిస్తోంది!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పుష్ప' సినిమాతో హీరో అల్లు అర్జున్​కు పాన్ ఇండియన్​ స్టార్​గా మారిపోయారు. ఈ సినిమా రాకముందు వరకు సౌత్ ఆడియెన్స్​ మాత్రమే ఆయన సినిమా అప్డేట్స్​ కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు సీన్​ మారిపోయింది. ఆయన చిత్రాల అప్డేట్స్​ కోసం సౌత్​ టు నార్త్ ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంతో ఆసక్తిగా వెయిట్​ చేస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప ద రైజ్​'(పార్ట్​-1) సినిమా సంచలన విజయం సాధించడం వల్ల.. అభిమానులు సినిమా పార్ట్​-2​ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మేకర్స్​ కూడా మూవీకి సంబంధించి అప్డేట్స్​ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై ప్రేక్షకులకు భారీ ఆశలు పెరిగేలా చేస్తున్నారు.

Pushpa-2 The Rule Trailer
పుష్ప-2లో అల్లు అర్జున్​

పుష్ప పార్ట్-1 మంచి విజయం సాధించడంతో దీని సీక్వెల్​ను మరింత గ్రాండ్​గా రూపొందిచేందుకు కృషి చేస్తున్నారు దర్శకనిర్మాతలు. నిర్మాణ సంస్థ కూడా ప్రాజెక్ట్​కు సంబంధించి బడ్జెట్​ విషయంలో రాజీ పడకుండా నిర్మాణ విలువలతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక అల్లు అర్జున్​ కూడా ఈ సీక్వెల్​తో 'పుష్ప' కన్నా హై రేంజ్​లో సూపర్​ హిట్ అందుకొని వరల్డ్​ వైడ్​గా తన క్రేజ్​ను మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. రష్మిక హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్​ హౌస్​ 'మైత్రి మూవీ మేకర్స్' సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Last Updated : Apr 7, 2023, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.