ETV Bharat / entertainment

అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు 'నాగ' అని ఎందుకు ఉంటుందో తెలుసా? - Akkineni Family latest news

టాలీవుడ్​లో అక్కినేని ఫ్యామిలీ ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అక్కినేని నాగేశ్వర రావు నుంచి అఖిల్ వరకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఈ కుటుంబంలో చాలా మందికి పేరు ముందు నాగ అని ఎందుకు వస్తుందో తెలుసా?

Akkineni Family Naga Name secret
అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు 'నాగ' అని ఎందుకు ఉంటుందో తెలుసా?
author img

By

Published : Jan 21, 2023, 12:37 PM IST

తప్పులని విజయాలకు మెట్లుగా చేసుకుని, శ్రమనే విశ్వసించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు వారు ముద్దుగా పిలుచుకొనే ఏఎన్నార్‌. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించి న‌ట సామ్రాట్‌గా ఖ్యాతి గడించారు. త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఆయ‌న తర్వాత రెండు తరాల వారసులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇలా పలువురు ఇండ‌స్ట్రీలో స్టార్ స్టేటస్​ను అందుకుని కెరీర్​లో రాణిస్తున్నారు.

'విక్ర‌మ్' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఆ తర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్​ హీరోగా, 'మన్మథుడి'గా ఎక్స్​పెరిమెంట్​ చిత్రాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపైనూ రియాల్టీ షోతో ముందుకెళ్తున్నారు. ఇక నాగార్జున తర్వాత ఇండ‌స్ట్రీలో ఆయ‌న వార‌సులుగా నాగ‌చైత‌న్య‌, అఖిల్ ప్ర‌స్తుతం రాణిస్తున్నారు. అయితే ఈ ఇద్ద‌రికీ మొద‌ట్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత చైతూ క్రేజ్ దక్కించుకున్నా.. అఖిల్​ మాత్రం ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు.

Akkineni Family Naga Name secret
అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు 'నాగ' అని ఎందుకు ఉంటుందో తెలుసా?

అయితే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ కుటుంబంలో దాదాపుగా అంద‌రికీ పేర్ల‌ ముందు నాగ అని వ‌స్తుంది. అయితే దీనిపై గ‌తంలోనే నాగార్జున ఓసారి క్లారిటీ ఇచ్చనట్లు కథనాలు ఉన్నాయి. త‌మ ఫ్యామిలీలో అంద‌రి పేర్ల‌కు ముందు నాగ అని ఎందుకు వ‌స్తుందో వివరించారాయన. అదేంటంటే.. నాగేశ్వ‌ర రావు క‌డుపులో ఉన్న‌ప్పుడు ఆయ‌న త‌ల్లికి క‌ల‌లో పాములు క‌నిపించేవ‌ట‌. దీంతో ఆమె త‌న కొడుకికి నాగేశ్వ‌ర రావు అని పేరు పెట్టారట. అంతేకాదు.. త‌మ కుటుంబంలో పుట్టే వారసులకు నాగ అని పేరు వ‌చ్చేలా పెట్టాల‌ని అనుకున్నారట. దీంతో నాగేశ్వ‌ర రావు.. త‌న కుమారుడు నాగార్జున‌కు అని పేరు పెట్టగా.. తర్వాత నాగార్జున కూడా అదే ఫాలో అయ్యారట. అయితే అఖిల్ విష‌యంలో మాత్రం అలా చేయ‌లేదు. ఎందుకంటే మొద‌టి సంతానానికి మాత్ర‌మే అలా పెట్టాల‌ని అనుకున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ కథనాలు మాత్రం గతంలో ఇలా వచ్చాయి.

ఇదీ చూడండి: నయన తార బ్యూటీ సీక్రెట్స్ కావాలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.