ETV Bharat / entertainment

'ఆ అరుదైన అవకాశం ఆరాధ్యకు దక్కింది.. అదొక తీపి జ్ఞాపకం' - పొన్నియన్​ సెల్వన్​ చిత్రం

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్​ ప్రాజెక్టు 'పొన్నియన్​ సెల్వన్​' సినిమాలో అందాల తార ఐశ్వర్యరాయ్​ సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎవరకీ దక్కని ఓ అరుదైన అవకాశం తన కుమార్తెకు దక్కిందని ఐశ్వర్య తెలిపారు. అదేంటంటే?

aishwarya rai aradhya bachan
aishwarya rai aradhya bachan
author img

By

Published : Sep 25, 2022, 3:17 PM IST

Updated : Sep 25, 2022, 6:55 PM IST

స్టార్​ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు 'పొన్నియిన్‌ సెల్వన్​'. ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు చిత్రబృందం మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇక ఈ సినిమాలో 'నందిని' పాత్రలో నటించిన అందాల తార ఐశ్వర్య రాయ్‌.. ముంబయిలో జరిగిన ప్రమోషనల్‌ ఈవెంట్‌లో మణిరత్నంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మణిరత్నం నాకు గురువు. నా మొదటి సినిమా ఆయన దర్శకత్వంలోనే నటించాను. ఒక నటిగా నా ప్రయాణం ఆయన దర్శకత్వంతో మొదలైనందుకు నేను అదృష్టవంతురాలిని. ఆయన ఉత్తమ గురువు".

"అప్పట్లో ఇరువర్‌, గురు, రావణ్‌, ఇప్పుడు పొన్నియిన్‌ సెల్వన్‌.. ఇలా మంచి సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. ఇక 'పొన్నియిన్‌ సెల్వన్‌'లో భాగమవ్వడం ఏ కళాకారుడికైనా కలే. అలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు మనమంతా అదృష్టవంతులం. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పని చేశారు" అని మణిరత్నంపై తనకున్న గౌరవాన్ని తెలిపారు.

aishwarya rai aradhya bachan
ఐశ్వర్యరాయ్​

ఇక తన కూతురు ఆరాధ్య గురించి మాట్లాడుతూ.."ఆరాధ్య అభిషేక్‌తో కలిసి పొన్నియిన్‌ మూవీ సెట్స్‌కు వచ్చింది. బాగా ఎంజాయ్‌ చేసింది. ఆమె మణిరత్నాన్ని చాలా గౌరవిస్తుంది. మణిరత్నం ఒక రోజు ఆమెకు 'యాక్షన్‌' చెప్పే అవకాశాన్ని కల్పించారు. ఆరోజు తన ఆనందానికి అవధులు లేవు. ఆమె జీవితంలో అది మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ఇప్పటివరకు అలాంటి అవకాశం మాలో ఎవరికీ రాలేదు. కానీ అది ఆరాధ్యకి దక్కింది. " అంటూ ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.

aishwarya rai aradhya bachan
పొన్నియన్​ సెల్వన్​ మూవీ సెట్స్​లో ఐశ్వర్య, ఆరాధ్య, అభిషేక్​ బచ్చన్​

ఇవీ చదవండి: ఈ క్వీన్​ ఆఫ్​ కోలీవుడ్​ అసలు వయసెంతో మీకు తెలుసా?

పసుపు, కుంకుమ రంగులో వెన్నెలమ్మ.. అందం ఏమైనా నీ సొంతమా..!

Last Updated : Sep 25, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.