ETV Bharat / entertainment

'నవ్వించడాన్ని సవాల్​గా తీసుకున్నా.. ఆ పాత్రలు చేయాలన్నది నా లక్ష్యం!'

author img

By

Published : Nov 30, 2022, 8:16 AM IST

'అందం.. నటన కలిస్తే ఐశ్వర్య లక్ష్మి' అంటూ ఇటీవల హీరో రవితేజ మెప్పు పొందిన ఈమె.. 'గాడ్సే' చిత్రంతో పాటు పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. డిసెంబరు 2న రానున్న 'మట్టికుస్తీ'లో విష్ణు విశాల్‌కు జోడీగా నటించింది. చిత్రం విడుదలను పురస్కరించుకుని ఐశ్వర్య లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే..

Aishwarya Lekshmi Interview:
Aishwarya Lekshmi Interview:

Aishwarya Lekshmi Interview: ''హాస్య ప్రధానంగా సాగే పాత్రలు ఇదివరకెప్పుడూ చేయలేదు. తొలిసారి 'మట్టి కుస్తీ'తో నవ్వించే అవకాశం వచ్చింది. ఆ కోణంలో నటిగా ఈ సినిమా నాకో సవాల్‌ విసిరింది. తప్పకుండా నా నటన ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పింది కథానాయిక ఐశ్వర్య లక్ష్మి. 'అందం.. నటన కలిస్తే ఐశ్వర్య లక్ష్మి' అంటూ ఇటీవల కథానాయకుడు రవితేజ మెప్పు పొందిన ఈమె, 'గాడ్సే' చిత్రంతో పాటు పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. డిసెంబరు 2న రానున్న 'మట్టికుస్తీ'లో విష్ణు విశాల్‌కు జోడీగా నటించింది. చిత్రం విడుదలను పురస్కరించుకుని ఐశ్వర్య లక్ష్మి విలేకర్లతో ముచ్చటించింది.

''మంచి కుటుంబ భావోద్వేగాలు, వినోదం కలబోతగా రూపొందిన చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. ఇందులో నాది కథానాయిక పాత్రే అయినా... కొన్ని పోరాట ఘట్టాల్లో కూడా కనిపిస్తా. ఆ పాత్ర శారీరకంగా నా నుంచి చాలా డిమాండ్‌ చేసింది. ముందస్తుగా సన్నద్ధం కావాల్సి వచ్చింది. తొలిసారి కామెడీ కూడా చేశా. నాకు భావోద్వేగ సన్నివేశాలు చేయడం కొట్టినపిండి. కానీ ఎప్పుడూ నవ్వించలేదు. దాన్ని కూడా ఓ సవాల్‌గా తీసుకుని నటించా''

Aishwarya Lekshmi Interview:
ఐశ్వర్య లక్ష్మి

''మూడేళ్ల కిందట ఈ కథ విన్నా. అయితే మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ స్క్రిప్ట్‌ నా దగ్గరికే వచ్చింది. అయితే ఆ మూడేళ్ల కాలంలో నేను కొన్ని సినిమాలు చేయడంతో నాలో నటిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతో 'మట్టి కుస్తీ' చేయాలని నిర్ణయించుకున్నా. భార్యాభర్తల మధ్య సాగే కుస్తీ ఇది (నవ్వుతూ). విష్ణు విశాల్‌ కష్టజీవి. ఆయన కథల ఎంపిక కూడా నాకు ఇష్టం. నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం''.

Aishwarya Lekshmi Interview:
ఐశ్వర్య లక్ష్మి

''ఈ సినిమాకి రవితేజ సర్‌ కూడా నిర్మాతే. ఆయన సెట్‌కి ఎప్పుడూ రాలేదు. విష్ణు విశాల్‌ నమ్మి, చివరిగా నాకు సినిమా చూపించండని మాత్రమే చెప్పారట. ఆయన సినిమా చూసి మెచ్చుకున్నారు. విడుదలకు ముందస్తు వేడుకలో ఆయన నా గురించి చెప్పిన విషయాలు ఉత్సాహాన్నిచ్చాయి. తెలుగు ప్రేక్షకుల సినీ అభిరుచి కూడా గొప్పగా ఉంటుంది. తెలుగులో నాకు సాయిపల్లవి, సత్యదేవ్‌లతో మంచి పరిచయం ఉంది. కొత్త సినిమాల విషయంలో తొందరేం లేదు. మంచి కథ, గుర్తు పెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం'' అంటూ చెప్పుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.