ETV Bharat / entertainment

తెలుగు ఇండియన్​​ ఐడల్ విజేతగా వాగ్దేవి! - తెలుగు ఐడల్ విన్నర్​ వాగ్దేవి

Telugu Indian Idol winner: 15 వారాల పాటు ఎంతో ఆసక్తిగా సాగిన తెలుగు ఇండియన్​ ఐడల్​ రియాలిటీ షో ముగిసింది. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠకు తెరపడింది. సింగర్​ వాగ్దేవి ఈ ఫస్ట్​ సీజన్​ విజేతగా నిలిచి మెగాస్టార్​ చిరంజీవి చేతుల మీదగా ట్రోఫీని అందుకుంది.

తెలుగు ఐండియన్​ ఐడల్ విజేతగా వాగ్దేవి
తెలుగు ఐండియన్​ ఐడల్ విజేతగా వాగ్దేవి
author img

By

Published : Jun 18, 2022, 10:37 AM IST

Updated : Jun 18, 2022, 10:45 AM IST

Telugu Indian Idol winner: ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహాలో ప్రసారమవుతున్న 'తెలుగు ఇండియన్​ ఐడల్' కార్యక్రమం ముగిసింది. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారో అన్న ఉత్కంఠకు తెరదించుతూ.. కంటెస్టెంట్​ వాగ్దేవి టైటిల్​ను ముద్దాడింది. చీఫ్ గెస్ట్​గా వచ్చిన చిరంజీవి చేతుల మీదగా ట్రోఫిని అందుకుంది. రూ.10లక్షల ప్రైజ్​మనీ కూడా గెలుచుకుంది. గీతా ఆర్స్ట్స్​ నుంచి రానున్న ఓ సినిమాలో పాడే అవకాశాన్ని దక్కించుకుంది! కాగా, మొదటి రన్నరప్​ శ్రీనివాస్​కు రూ.3లక్షలు, రెండో రన్నరప్​ వైష్ణవికి రూ.2లక్షలు నగదు బహుమతిని దక్కించుకున్నారు. వైష్ణవి పాటకు మెచ్చి చిరు.. తన 'గాడ్​ఫాదర్'​ సినిమాలో పాడే అవకాశాన్ని ఇచ్చారు.

ఇక ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్​, నటి నిత్యామేనన్​, గాయకుడు కార్తిక్​లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ షోలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది యువతీయువకులు ప్రయత్నించారు. చివరికి 12మంది మాత్రమే ఎంపికయ్యారు. వారి మధ్య జరిగిన పోటీలో ఐదుగురు ఫైనల్స్​కు చేరుకున్నారు. ఇందులో విజయం వాగ్దేవిని వరించింది. ఇక ఈ ఫినాలేలో 'విరాటపర్వం' టీమ్ రానా, సాయిపల్లవి కూడా సందడి చేశారు.

ఇదీ చూడండి: 'కొన్ని పొరపాట్లు జరిగాయి.. నాపై కావాలనే ఆ పంచ్​లు.. అయినా...'

Last Updated : Jun 18, 2022, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.