Aha OTT Tamil launch: మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిని ముఖ్యమంత్రి.. తమిళం కోసం ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమన్నారు.
" ఈ ఓటీటీ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. తమిళం కోసం అయితే నేను ఏ సమయంలోనైనా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ ఓటీటీ పేరు కూడా ఆహా అని ఉంది. చాలా సంతోషంగా ఉన్నప్పుడు 'ఆహా' అంటారని అందరికీ తెలుసు. సమాజానికి ఉపయోగపడేవిధంగా ఈ ఆహా పనిచేయాలని కోరుకుంటున్నా. అందరికీ 'సిత్తిరై తిరునాళ్' శుభాకాంక్షలు. ఈ రోజు అంబేద్కర్ జయంతి. ఆయన జయంతిని సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తామని ఏప్రిల్ 13న అసెంబ్లీలో ప్రకటించాను. ఇదే రోజున ఆహాను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉంది."
- ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి.
తెలుగులో మంచి సక్సెస్ సాధించింది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్. దీంతో తమిళ భాషలోకి తీసుకెళ్లారు అల్లు అరవింద్. చెన్నైలో గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ దర్శకుడు భారతిరాజా, ఎస్పీ ముథురామన్, నిర్మాత కలైపులి థాను తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొమ్మా ఉయ్యాల, ఎఫ్3 సాంగ్స్ అప్డేట్స్.. దూసుకెళ్తున్న ఆచార్య ట్రైలర్