ETV Bharat / entertainment

నా తర్వాతి సినిమా 'దిల్లీ ఫైల్స్': వివేక్​ అగ్నిహోత్రి

'కశ్మీర్ ఫైల్స్'తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. తాను చేయబోయే తర్వాతి సినిమా 'దిల్లీ ఫైల్స్' అని ప్రకటించారు. 'కశ్మీర్ ఫైల్స్'ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : Apr 15, 2022, 7:25 PM IST

Updated : Apr 15, 2022, 10:58 PM IST

Vivek
వివేక్

కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. మరో మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. తన తదుపరి సినిమా 'దిల్లీ ఫైల్స్' అని ప్రకటించారు. కశ్మీర్ ఫైల్స్ తీసిన స్ఫూర్తిలో ఈ సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కశ్మీర్ ఫైల్స్​ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్​ చేశారు.

'ది కశ్మీర్ ఫైల్స్' కోసం నాలుగేళ్లు కష్టపడినట్లు తెలిపారు వివేక్​. ఈ సినిమా ద్వారా.. కశ్మీరీ హిందువులపై జరిగిన నరమేధం, వారికి జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. చాక్లెట్​, హేట్ స్టోరీ, జిద్ వంటి సినిమాలు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చినవే.

ఈ సినిమా చూడాలని స్వయంగా పీఎం మోదీ చెప్పడం.. భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్​లో వినోద పన్ను రాయితీగా.. ఇవ్వడం వల్ల రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో ఈ సినిమాకు మరింత హైప్​ క్రియేట్​ అయ్యింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద సంచలనం నమోదు చేసింది.

  • I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus.

    It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP

    — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Apr 15, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.