ETV Bharat / entertainment

లైగర్​ ఆడకపోవడంపై విజయ్​ దేవరకొండ ఏం అన్నారంటే? - లైగర్ మూవీ ఫ్లాప్​

భారీ అంచనాల మధ్య విడుదలైన 'లైగర్‌' పరాజయం చెందిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రౌడీ హీరో విజయ్​ దేవరకొండ మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే?

liger flop
లైగర్​ ఫ్లాప్​పై విజయ్​ రియాక్షన్​
author img

By

Published : Oct 10, 2022, 3:01 PM IST

'లైగర్‌' పరాజయం తర్వాత మొదటిసారి సైమా వేడుకలో హీరో విజయ్‌ దేవరకొండ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమంలో యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది సౌత్‌ ఇండియన్‌ సినిమా అవార్డును గెలుచుకున్న విజయ్‌.. 'లైగర్‌' ఆడకపోవడంపై స్పందించారు.

''ఈ వేదికపై అవార్డు తీసుకున్న వారందరికీ నా అభినందనలు. గొప్ప సినిమాలతో ఈ ఏడాది చిత్రపరిశ్రమను మీరు ముందుకు తీసుకువెళ్లారు. నేను కూడా ప్రయత్నించా. కష్టపడి పనిచేశా. కానీ, అది సరిపోలేదు. మనందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఎలాంటి రోజుల్లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. నిజం చెప్పాలంటే నేను ఈ కార్యక్రమానికి రాకూడదనుకున్నా. కానీ, మీ అందరికీ ఓ మాట ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చా. అభిమానులు, కుటుంబం, స్నేహితుల్ని అలరించేందుకు నేను మరింత కష్టపడి పనిచేస్తా'' అని విజయ్‌ దేవరకొండ వివరించారు. కాగా, దక్షిణాదిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సైమా' అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది.

భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన 'లైగర్‌' ప్రేక్షకుల్ని నిరాశపర్చింది. పూరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌.. ఫైటర్‌గా కనిపించారు. ప్రస్తుతం విజయ్‌ 'ఖుషి'లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో సమంత కథానాయిక.

ఇదీ చూడండి: నయన్​కు​ కవల పిల్లలు.. ఎన్టీఆర్​ చెప్పిందే నిజమైందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.