ETV Bharat / entertainment

60 థియేటర్లలో 'ఆదిపురుష్​' త్రీడీ టీజర్.. ట్రోల్స్​కు దిల్​రాజు స్ట్రాంగ్ కౌంటర్ - ఆదిపురుష్ త్రీడీ టీజర్ థియేటర్ల లిస్టు

Adipurush 3d Teaser : 'ఆదిపురుష్' టీజర్​పై వస్తున్న ట్రోలింగ్​పై చిత్ర యూనిట్​ స్పందించింది. టీజర్​ను త్రీడీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 థియేటర్లలో త్రీడీలో ఆదిపురుష్​ టీజర్​ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

adipurush 3d teaser
adipurush 3d teaser
author img

By

Published : Oct 6, 2022, 8:32 PM IST

Updated : Oct 6, 2022, 9:41 PM IST

Adipurush 3d Teaser : 'ఆదిపురుష్'పై వస్తున్న ట్రోలింగ్​పై మూవీ టీమ్ స్పందించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్​లో ప్రెస్​ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. విలేకరులకు స్పెషల్​ స్క్రీనింగ్​ వేశారు. అనంతరం మీడియా సమావేశంలో టాలీవుడ్​ దిగ్గజ నిర్మాత దిల్​ రాజు మాట్లాడారు. ఇటువంటి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. మొదటి రోజు అన్ని సినిమాలకు నెగెటివ్ వైబ్స్​ కామన్​ అని చెప్పారు. పెద్ద స్క్రీన్ల కోసం ఈ సినిమా తీశారని.. ఫోన్లలో, టీవీల్లో చూస్తే ఆ ఎక్స్​పీరియెన్స్​ రాదని అన్నారు. మంచి విజువల్ ఎఫెక్ట్స్​ ఉన్న సినిమాలు పెద్ద స్క్రీన్లపైనే బాగుంటాయన్నారు.

సాధారణ ప్రేక్షకుడికి నచ్చితే ఆ సినిమా విజయం సాధిస్తుందని చెప్పారు దిల్​రాజు. ఇప్పుడు ట్రోలింగ్​ను పట్టించుకోవద్దన్నారు. ఇటీవల విడుదలైన 'పీఎస్​-1', 'కార్తికేయ-2', 'బింబిసార' లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయని చెప్పారు. ఆ తర్వాత ప్రభాస్​ మాట్లాడారు. 'ఆదిపురుష్' టీజర్​ చూసి తాను చిన్న పిల్లాడిని అయిపోయినట్లు చెప్పారు. శుక్రవారం 'ఆదిపురుష్'​ సినిమా త్రీడీ టీజర్​ను రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సాంకేతికత దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ సినిమా ​పెద్ద స్క్రీన్స్​ కోసం తీశామని పేర్కొన్నారు.

అనంతరం ఓం రౌత్​ మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్.. సినిమాపై ఉన్న అభిరుచితో 'ఆదిపురుష్' తీశామని చెప్పారు. ఈ సినిమాను నిర్మిస్తున్న మరో బ్యానర్​ రెట్రో ఫైల్స్​ అధినేత రాజేశ్​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

థియేటర్ల లిస్టు
adipurush 3d teaser
థియేటర్ల లిస్టు
adipurush 3d teaser
థియేటర్ల లిస్టు

ఇవీ చదవండి: 'ఆదిపురుష్'​కు కాపీ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన యానిమేషన్​ సంస్థ

నవంబర్​లో సెట్స్ మీదకు 'NBK 108'.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్​!

Last Updated : Oct 6, 2022, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.